- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రతీ సమస్యా ఫిర్యాదు చేయబడాలి.. సోషల్ మీడియా అకృత్యాలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్:మహిళలపై సోషల్ మీడియాలో జరుగుతున్న అకృత్యాల పట్ల సినీ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి (Congress MLC Vijayashanthi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె.. ఈ సోషల్ మీడియా పోస్టింగ్స్ (Social Media Postings), కామెంట్స్(Comments) ఇంకా ఎంతో బాధకు గురి చేసే ధోరణి, మా వంటి మహిళలకు పని చెయ్యలేని పరిస్థితులను కల్పిస్తున్నాయి రాములమ్మా అని ఫోన్‌ల ద్వారా.. ప్రత్యక్షంగా.. ఎందరో మహిళలు తనను అడుగుతున్నారని చెప్పారు. దీనిపై ప్రతి సమస్యా కంప్లైంట్ (Complaint) చెయ్యబడాలి.. ప్రతి సమస్యా పరిష్కరించబడాలని ఆమె అన్నారు.
మన దేశంలో చాలా సమస్యల పరిష్కారానికి అనుగుణంగా నియమనిబంధనలు, చట్టాలు ఉన్నాయని, ఆఫీసుల్లో మహిళల రక్షణకు విమెన్ ప్రొటెక్షన్ సెల్స్ (Women Protection Cells) పెట్టాలనే సూచన కూడా ఉందని చెప్పారు. ఇక సోషల్ మీడియాలో ట్రోలింగ్ (Social Media Trolling) సంగతి చెప్పాల్సిన పని లేదని, ఆ పోస్టింగ్స్, కామెంట్స్, స్టేట్‌మెంట్స్ ఎన్నో కుటుంబాలల్లో బాధను కలిగిస్తూ, సమాజంలో కష్టాన్ని కలిగిస్తూ పని చేయలేని పరిస్థితులు ఉంటున్నాయని పలువురు మహిళలు చెబుతున్నట్లు తెలిపారు. ఈ దుర్మార్గపు ధోరణిలో కొందరు నడిపే సోషల్ మీడియా ఎలా ఉంటుందో.. సాక్షాత్తు తెలంగాణ ప్రభుత్వానికి జింకలు, నెమళ్ళ వీడియోల ద్వారా హెచ్‌సీయూ సందర్భంగా అవగతమై, తీవ్రంగా వ్యవహరించి తీరాలని సీఎం రేవంత్ (CM Revanth) స్వయంగా అభిప్రాయ పడ్డట్లు వార్తలు వచ్చాయని చెప్పారు.
ప్రజా ప్రభుత్వమైన కాంగ్రెస్ మొత్తం రాష్ట్రంలోని ప్రతి మహిళ సమస్య పట్లా.. పై అంశాల్లో ఇప్పటికే తగు విధానాన్ని పాటిస్తున్నదని అన్నారు. అయితే, ప్రతి సమస్య పట్లా తక్షణమే స్పందించి తీవ్ర చర్యలు తీసుకునే వ్యవస్థను సంపూర్ణ అధికారాలతో మరింత పటిష్టంగా నడిపించగలదని, అవసరమైన అరెస్ట్‌లు, తదనంతర కార్యాచరణ ద్వారా మహిళా లోకానికి ఆత్మ ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇవ్వగలదని నమ్ముతున్నానని చెప్పారు. నా ఈ అభిప్రాయాన్ని మహిళా అభ్యున్నతికై నిరంతరం పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అని విజయశాంతి రాసుకొచ్చారు.