BRS MLA: కేసీఆర్ ఉన్నంతకాలం రేవంత్ రెడ్డి ఆటలు సాగవు

by Gantepaka Srikanth |
BRS MLA: కేసీఆర్ ఉన్నంతకాలం రేవంత్ రెడ్డి ఆటలు సాగవు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో 11 నెలలుగా ఆటవిక పాలన నడుస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద(MLA KP Vivekanand) అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మోసం చేస్తోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇప్పటివరకు తన మార్క్‌ను చూపలేకపోయారని విమర్శించారు. అక్రమ కేసులు, అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్, హరీష్ రావుపై బురదచల్లుతున్నారని అన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలహీనపర్చాలని కుట్ర చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రంలో ఒక్కటి అయ్యాయని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్(Bandi Sanhay) సహాయమంత్రిగా పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ కలిసి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లది బంధం ఫెవికాల్ కంటే స్ట్రాంగ్‌గా మారిందని సెటైర్ వేశారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కలెక్టర్‌పై దాడి జరిగితే బండి సంజయ్ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. కొడంగల్ అగ్నిగుండంగా మారితే బండి సంజయ్ ఎక్కడ నిద్రపోయారని అడిగారు. కేటీఆర్ బామ్మర్ది ఇంట్లో పార్టీ జరిగితే సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఫోన్ వెళ్లగానే బండి సంజయ్ స్పందించారని కీలక ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ కలిసి కేటీఆర్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉన్నంతకాలం రేవంత్ రెడ్డి ఆటలు సాగవని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed