Konda Visveshwar Reddy: వాటి కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు దేశాన్నైనా అమ్ముతారు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by Prasad Jukanti |
Konda Visveshwar Reddy: వాటి కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు దేశాన్నైనా  అమ్ముతారు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ముస్లిం ఓట్ల కోసం బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ పార్టీలు దేశాన్నైనా అమ్ముకుంటాయని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (ఎంపీ Konda Visveshwar Reddy) విమర్శించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డును తీసుకువచ్చింది కాంగ్రెస్ (Congress) పార్టీనే అన్నారు. వక్ఫ్ చట్ట సవరణకు మద్దతుగా శుక్రవారం ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పంచె కట్టు, తల్వార్ ధరించి గుర్రాలపై ర్యాలీగా విన్నూత రీతిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఔరంగజేబు విధానాలు ఇప్పటికీ ప్రజలను పట్టి పీడిస్తన్నాయని ధ్వజమెత్తారు. 300 ఏళ్ల కింద ఔరంగా జేబు నోటి మాటతో భూములిచ్చిందోచ్చు, కానీ నేడు కుప్పలువుకుప్పలుగా డాక్యుమెంట్స్ తో భూములు మావని అంటున్నారు. వక్ఫ్ బోర్డు అనేది ఒక క్రూరమైన హాస్యం, నవ్వాలో , ఏడ్వాలో, బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. వక్ఫ్ యాక్ట్ ను అడ్డం పెట్టుకొని చేవెళ్లలో ఇంకా ఔరంగజేబు తరహా ఆక్రమణలు చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ బోర్డును తీసుకువచ్చిందని, సుప్రీంకోర్టుకు మించి వక్ఫ్ బోర్డుకు అధికారాలు కట్టబెట్టారని మండిపడ్డారు. ఈ చట్టం రాజ్యాంగానికి సెక్యులర్ స్పూర్తికి వ్యతిరేకం అన్నారు.

ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు కీలకం అని ఎవరైనా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనన్నారు. శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ బోర్డు సవరణ చట్టం అమల్లోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగ పుస్తకం పట్టుకొని ఒక గడ్డం ఆయన తిరుగుతున్నారని ఆ బుక్ లో ఖాళీ పేజీ లు తప్ప ఏమి లేదన్నారు. కుల గణన అంటూ మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు ఎంత మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలను సీఎంలుగా చేశారని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ ట్రస్ట్ లో ఎంత మంది ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని నిలదీశారు. నాడు మన్మోహన్ సింగ్ ను ఎలా వాడుకున్నారో నేడు ఖర్గే ను కూడా అలాగే కాంగ్రెస్ వాడుకుంటోందని విమర్శించారు.

వక్ఫ్ అనేది ఖురాన్ లో లేదు. ప్రపంచంలో అన్ని దేశాల్లో వక్ఫ్ మతం కిందకు రాదని చెబుతున్నాయి. వక్ఫ్ అనేది ఇతర దేశాల్లో ప్రభుత్వం కిందనే ఉంది. దేవాలయం అనేది మతనికి సంధించింది. వక్ఫ్ ఆనేది సమాజానికి సంబంధించినదన్నారు. వక్ఫ్ బోర్డు చట్టంలో చాలా లోపాలున్నాయని, వక్ఫ్ బోర్డులో మహిళలు, నాన్ ముస్లింలకు చోటు కల్పించాలన్నారు. వక్ఫ్ బోర్డు కు తిరుపతి బోర్డు కు లింకా? అని ప్రశ్నించారు. రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ విధానాలు నచ్చక అంబేద్కర్ కేబినెట్ వదిలేసి వెళ్లిపోయారని, రాజ్యాంగాన్ని బొంద పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ దన్నారు. వక్ఫ్ బోర్డు గుట్టల బేగం పెట్ లో భూములను లాక్కూనే ప్రయత్నం చేస్తోందన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలకు బీజేపీ దూరం అన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ముస్లిం సమాజానికి వ్యతిరేకం కాదన్నారు. ఎవరడ్డుకున్న వక్ఫ్ బోర్డు సవరణ జరుగుతుందన్నారు.

Advertisement

Next Story