‘జీవితం కష్టాల్లో ఉన్నప్పుడు’.. అంటూ బ్యూటిపుల్ వీడియో పంచుకున్న జూనియర్ సమంత

by Anjali |
‘జీవితం కష్టాల్లో ఉన్నప్పుడు’.. అంటూ బ్యూటిపుల్ వీడియో పంచుకున్న జూనియర్ సమంత
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ సంయుక్త మీనన్ (Samyuktha Menon) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ అమ్మడు పాప్‌రకార్న్ (Popcorn) అనే మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత కన్నడ, తెలుగులో కూడా అవకాశాలు దక్కించుకుని మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక 2018 లో కలరి మూవీలో నటించి ప్రేక్షకుల్ని మెప్పించిన సంయుక్త మీనన్ తెలుగులో కళ్యాణ్ రామ్ సరసన బింబిసార సినిమాలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది.

తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan) సరసన భీమ్లా నాయక్ సినిమాలో చాన్స్ కొట్టేసింది. 2022 లో కన్నడ మూవీ అయిన గాలిపట 2 సినిమాలో నటించి జనాల్ని మంత్రముగ్దుల్ని చేసిందనడంలో అతిశయోక్తిలేదు. అలాగే సంయుక్త మీనన్ లిల్లీ, తీవండి, జులై కాత్రిల్, ఓరు యమందన్ ప్రేమకథ, ఉయారే కల్కి, ఎదక్కడ్ బెటాలియన్ 06, వెళ్లం: ది ఎస్సెంటియాల్ డ్రింక్, అండర్ వరల్డ్, ఆనుమ్ పెన్నుమ్, ఎరిడ, వోల్ఫ్, కడువా, విరూపాక్ష..

డెవిల్, లవ్ మీ, మహారాగ్ని: క్వీన్ ఆఫ్ క్వీన్స్ (Maharagni: Queen of Queens), రామ్ శర్వా, స్వయంభూ వంటి చిత్రాల్లో నటించింది. ఇకపోతే ఈ అమ్మడు తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్‌తో అభిమానుల్ని అలరిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా సంయుక్త మీనన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పంచుకుంది. అంతేకాకుండా ఈ వీడియోకు ఓ క్యాప్షన్ జోడించింది. ‘‘జీవితం కష్టాల్లో ఉన్నప్పుడు’.. అంటూ రాసుకొచ్చింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వగా జూనియర్ సమంతపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Next Story