మాజీ CM జగన్‌పై కామెడీ స్కిట్స్.. స్పందించిన వైసీపీ కీలక నేత

by Gantepaka Srikanth |
మాజీ CM జగన్‌పై కామెడీ స్కిట్స్.. స్పందించిన వైసీపీ కీలక నేత
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం(NDA Govt)పై వైసీపీ(YCP) కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాల్లో పసలేదని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదనే తమ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లడం లేదని తెలిపారు. కూటమి నేతలను ప్రశంసిస్తూ, పొగడ్తలతో ముంచెత్తడానికే సభ సరిపోయిందని విమర్శించారు. అసెంబ్లీలో స్పీకర్ ఎలా మాట్లాడారో అందరూ చూశారు. దొంగచాటున సంతకాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు పవిత్రత లేకుండా చేశారని అన్నారు. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చి శునకానందం పొందుతున్నారని విమర్శించారు.

తరచూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) తనకు మంచి మిత్రుడు అని చెప్పుకునే చంద్రబాబు.. ఎందుకంత కోపం అని ప్రశ్నించారు. కల్చరర్ ప్రొగ్రామ్స్(Cultural Programs) పేరు చెప్పుకొని సరదాలు తీర్చుకుంటున్నారు.. ఆ స్కిట్స్‌లో కూడా జగన్(Jagan) పేరును మర్చిపోలేకపోతున్నారని అన్నారు. కాగా, గురువారం విజయవాడ(Vijayawada)లోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే(MLA), ఎమ్మెల్సీ(MLC)లకు కల్చరర్ ప్రొగ్రామ్స్(Cultural Programs) నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరావులు చేసిన కామెడీ స్కిట్ అందరినీ తెగ ఆకట్టుకున్నది.

Next Story

Most Viewed