- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం.. 18 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్

- హనీట్రాప్, కాంట్రాక్టుల్లో ముస్లింల రిజర్వేషన్‌పై రభస
- వెల్‌లోకి వెళ్లి ఘెరావ్ చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు
- ఆరు నెలల పాటు 18 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్
దిశ, నేషనల్ బ్యూరో: హనీట్రాప్ కుంభకోణం, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు వంటి విషయాల్లో కర్ణాటక అసెంబ్లీలో శుక్రవారం తీవ్ర గందరగోళం నెలకొంది. సభా కార్యాకలాపాలను అడ్డుకోవడమే కాకుండా, వెల్ లోకి దూసుకెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు బిల్లు పత్రాలను చించి నిరసన వ్యక్తం చేశారు. హనీ ట్రాప్ విషయంలో లోతైన దర్యాప్తు చేయాలని, కాంట్రాక్టుల్లో ముస్లిం రిజర్వేషన్లపై ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. అయితే సభకు ఆటంకం కలిగిస్తున్నారనే ఆరోపణలతో బీజేపీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ యూటీ ఖాదర్ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ ఆదేశాలను ధిక్కరించి, క్రమశిక్షణా రాహిత్యంతో.. అగౌరవంగా ప్రవర్తించారనే కారణంగానే వారిని సస్పెండ్ చేస్తున్నట్లు యూటీ ఖాదర్ ప్రకటించారు. అయితే సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంపైకి ఎక్కి.. కాగితాలను చింపి.. ఆయనపై విసిరేశారు. అంతే కాకుండా సభలోని వెల్‌లో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. దీంతో అసెంబ్లీ మార్షల్స్ వారిని సభ నుంచి బయటకు ఎత్తుకొని తీసుకొని వెళ్లారు.
సస్పెన్షన్‌కు గురైన వారిలో బీజేపీ చీఫ్ విప్ దొడ్డనగౌడ హెచ్ పాటిల్, అశ్వత్ నారాయణ్ సిఎన్, ఎస్‌ఆర్ విశ్వనాథ్, బిఎ బసవరాజ్, ఎంఆర్ పాటిల్, చన్నబసప్ప (చన్ని), బి సురేశ్ గౌడ్, ఉమానాథ్ ఎ కోట్యాన్, శరణు సలగార్, శైలేంద్ర బెల్‌డేల్, సికె రామమూర్తి, బిపి శే్‌పాల్ ఎ సువర్ణ, బిపి సువర్ణ, బిపి ఎ సువర్ణ, బసవరాజ్ మట్టిమూడ్, ధీరజ్ మునిరాజు, చంద్రు లమాని. బిపి సువర్ణ ఉన్నారు. వీరందరూ సస్పెన్షన్ ఉత్తర్వుల ప్రకారం ఇకపై అసెంబ్లీ హాలు, లాబీ, గ్యాలరీల్లోకి రాకుండా నిషేధం విధించారు. ఇకపై వారు ఏ స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో కూడా పాల్గొనకూడదని, వారి పేరుతో అసెంబ్లీ ఎజెండాలో ఎలాంటి విషయం పొందు పరచకూడదని స్పీకర్ తెలిపారు. ఈ సస్పెన్షన్ వ్యవధిలో వారు జారీ చేసే ఏవైనా ఆదేశాలు అంగీకరించబడవని పేర్కొన్నారు. పైగా కమిటీ ఎన్నికల్లో ఓటు వేయడానికి అనుమతించరని, జీత భత్యాలు కూడా చెల్లించబడవని స్పీకర్ నోటీసులు పేర్కొన్నారు.
శుక్రవారం కర్ణాటక అసెంబ్లీలో హనీట్రాప్ కుంభకోణం, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించే వివాదాస్పద బిల్లుపై గందరోళం నెలకొంది. కేంద్ర మంత్రులతో సహా 48 మంది రాజకీయ నాయకులపై వలపు వల విసిరినట్లు మంత్రి కేఎన్ రాజన్న ఆరోపించడంతో దానిపై ఇవ్వాళ సభలో బీజేపీ నాయకులు గందరగోళం సృష్టించారు.