- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలి’.. సీఎం సంచలన ఆదేశం

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని తూర్పు గోదావరి జిల్లా, గోపాలపురం నియోజకవర్గం, నల్లజర్ల మండలం, దూబచర్ల గాంధీ కాలనీలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్(BR Ambedkar) విగ్రహాన్ని అవమానించిన ఘటనను సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఖండించారు. భారతరత్న అంబేద్కర్‌ను అగౌరవపరిచేలా విగ్రహం పట్ల దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని DGPని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఈ ఘటనపై డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. కుట్రతో ఇటువంటి నేరాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు, ఆయా వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించే వారి పట్ల అత్యంత కఠిన వ్యవహరించాలని సూచించారు. ఈ క్రమంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని, వివిధ వర్గాలను రెచ్చగొట్టే వారిపై నిఘా ఉంచాలని సీఎం చంద్రబాబు సూచించారు.