- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Malla Reddy : మల్లారెడ్డి దారుణంగా మోసం చేశాడు! నాకు రూ.14 కోట్లు ఇవ్వాలి : బాధితుడు
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఆయన బంధువు నరసింహరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన తాాజాగా మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తనను దారుణంగా మోసం చేశాడని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా యాడారం తుర్కపల్లిలో నా 23 ఎకరాల వ్యవసాయ భూమిని కొంటానాని మల్లారెడ్డి నన్ను సంప్రదించి ఎకరం రూ.2 కోట్లకు మాట్లాడుకున్నాడు.. అని వెల్లడించారు. మొదలు మొత్తం కొంటానని నమ్మించి తరువాత రూ.8 కోట్లు మాత్రమే ఇచ్చి 9 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని తెలిపారు. మిగిలిన 14 ఎకరాలకు మల్లారెడ్డి దారి లేకుండా చేశాడని చెప్పారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి నాకు ఇంకా రూ.14 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమెరికాలో డాలర్ డాలర్ కూడబెట్టుకొని భూమిని కొన్నానని తెలిపారు. బంధువు అని నమ్మిన పాపానికి ప్రజలను మోసం చేసినట్టే నన్ను కూడా మోసం చేశాడని కల్లం నరసింహా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని వెల్లడించారు. ప్రభుత్వం తనకు ఈ విషయంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.