- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
వాయు కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి
by Aamani |
X
దిశ, జిన్నారం: జిన్నారం మండలంలోని గడ్డపోతారం పారిశ్రామిక వాడలో శుక్రవారం దట్టమైన వాయు కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు దట్టమైన కాలుష్య పొగలు గ్రామాన్ని కప్పేశాయి . దీంతో ప్రజలు శ్వాస తీసుకునేందుకు సైతం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా దట్టమైన వాయువులను బయటకు వదులు తుండటంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పారిశ్రామిక వాడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పీ సీ బీ అధికారులకు సమాచారం ఇచ్చామని, వాయు కాలుష్యాన్ని బయటకు వదులుతున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Next Story