Breaking:మోడీ విమానంలో సాంకేతిక సమస్య

by Prasad Jukanti |   ( Updated:2024-11-17 12:45:15.0  )
Breaking:మోడీ విమానంలో సాంకేతిక సమస్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి (PM Modi) ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణించాల్సిన విమానంలో (PM Aircraft) సాంకేతిక సమస్యల తలెత్తింది. దీంతో ఈ సమస్యను పరిష్కరించే వరకు విమానాన్ని జార్ఖండ్ లోని డియోఘర్ ఎయిర్ పోర్టులోనే ఉంచారు. దీని వలన ప్రధానమంత్రి న్యూఢిల్లీకి తిరిగు ప్రయాణం ఆలస్యం అవుతోంది. గిరిజనుల ఐకాన్ బిర్సా ముండా జయంతి నేపథ్యంలో జనజాతీయ గౌరవ్ దివస్‌, నవంబర్ 20న రాష్ట్రంలో రెండో దశ పోలింగ్ నేపథ్యంలో శుక్రవారం ప్రధాని జార్ఖండ్ (Jharkhand) లో రెండు ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించారు. తిరుగు ప్రయాణం సమయంలో విమానంలో టెక్నికల్ సమస్య తలెత్తింది. గమనించిన పైలట్లు విమానాన్ని టేకాప్ చేయలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Click Here For Twitter Post..

Advertisement

Next Story

Most Viewed