‘అది ఒక చీకటి అధ్యాయం’.. వైసీపీ పాలన పై మంత్రి పయ్యావుల సెన్సేషనల్ కామెంట్స్

by Jakkula Mamatha |
‘అది ఒక చీకటి అధ్యాయం’.. వైసీపీ పాలన పై మంత్రి పయ్యావుల సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Assembly budget meetings) కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశం(Assembly meetings)లో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ఈ క్రమంలో బడ్జెట్‌పై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్(Finance Minister Payyavula Keshav) సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో గత ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. మంత్రి పయ్యావుల మాట్లాడుతూ.. వైసీపీ సర్పంచులు ఉన్న చోట నిధులు ఇవ్వకపోవడంతో రూ.1450 కోట్లు గ్రామాలకు అందించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

గత వైసీపీ ప్రభుత్వం చివరకు చిన్న పిల్లల చిక్కీల్లోనూ రూ.175 కోట్లు బకాయిలు పెట్టిందని అన్నారు. రహదారులకు రూ.810 కోట్లు కూటమి ప్రభుత్వంలో కేటాయించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఒకటో తేదీన ఉద్యోగులకు జీతం ఇవ్వడం మర్చిపోయిందని ఎద్దెవా చేశారు. కానీ.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు మేలు జరిగిందని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ’ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోండి’ అని చెప్పే ప్రతి మాట స్ఫూర్తిగా తీసుకొని పని చేస్తామన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత దిక్కుతోచని స్థితిలో ఉన్న రాష్ట్రాన్ని 2014-19 మధ్య వ్యవసాయం(Agriculture), పరిశ్రమలు(Industries), నీటిపారుదల(Irrigation), రోడ్డు(Road), ఉపాధి(Employment) తదితర రంగాల్లో చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్లారని మంత్రి పయ్యావుల గుర్తు చేశారు. కానీ.. 2019 తర్వాత జరిగిన పరిణామాలు రాష్ట్రానికి ‘అది ఒక చీకటి అధ్యాయం’ అని పేర్కొన్నారు. ప్రజా వేదిక కూల్చడం నుంచి పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేయడం వరకు ఎన్నో అరాచకాలు జరిగాయని మంత్రి పయ్యావుల కేశవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందని వెల్లడించారు.

Advertisement

Next Story