Minister Sridhar Babu: సానుభూతి కోసం అరెస్ట్ మాట ఎత్తుతున్న కేటీఆర్.. మంత్రి శ్రీధర్‌బాబు హాట్ కామెంట్స్

by Shiva |
Minister Sridhar Babu: సానుభూతి కోసం అరెస్ట్ మాట ఎత్తుతున్న కేటీఆర్.. మంత్రి శ్రీధర్‌బాబు హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సానుభూతి కోసం పదే పదే కేటీఆర్ (KTR) అరెస్ట్ మాట ఎత్తుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన సచివాలయం (Secretariat)లో మీడియాతో మాట్లాడుతూ.. లగచర్ల (Lagacharla) ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోందని తెలిపారు. విచారణ పూర్తయ్యాక సూత్రధారులు ఎవరో.. పాత్రధారులెవరో అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని అన్నారు. లగచర్ల (Lagacharla)లో అధికారులపై హత్యాయత్నం జరగిందని ఆయన ఆరోపించారు. రైతుల ముసుగులు కొందరు దాడికి పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ (KTR) అరెస్ట్‌కు తాము ఎలాంటి కుట్రలు చేయడం లేదని అన్నారు. సానుభూతి కోసం కేటీఆర్ (KTR) పదేపదే అరెస్ట్ మాటను ఎత్తుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) పార్టీలు కుట్రలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridhar Babu) మండిపడ్డారు.

Advertisement

Next Story