- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
భక్తులతో కిటకిటలాడిన కోటిలింగాల..జనసంద్రమైన గోదావరి
దిశ, వెల్గటూర్ : శంభో శివశంభో శివ శివ శంభో అంటూ భక్తులు చేసిన నినాదాలతో కోటిలింగాల కోటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం మార్మోగింది.తెల్లవారుజాము నుంచే కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని వేలాది మంది భక్తులు గోదావరి పుణ్య స్థానాలకు కోటిలింగాల కు తరలిరాగా గోదావరి జనసంద్రమైంది. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కోటిలింగాల కితకిటలాడుతూ కార్తీక శోభను సంతరించుకుంది. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు గోదావరి తీరం తో పాటు ఆలయ పరిసరాల్లో పూర్తిగా మౌలిక వసతులు లోపించడంతో భక్తులు నానా అవస్థలు పడ్డారు.
పుణ్య స్నానాలు చేసిన మహిళా భక్తులు బట్టలు మార్చుకోవడానికి సరైన ఏర్పాట్లు కూడా చేయకపోవడం విశేషం. అలాగే భక్తులు ఎండ వేడిమి నుంచి సేద తీరడానికి ఆలయ పరిసరాల్లో టెంట్లు కూడా వేయకపోవడంతో భక్తులు ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే గోదావరిలో పుణ్య స్నానాలు చేసిన భక్తులు కార్తీక దీపాలను నదిలో వదిలేశారు. అనంతరం కోటేశ్వర స్వామి వారిని దర్శించుకొని కార్తీక దీపాలు పెట్టారు. ఈ క్రమంలో శుక్రవారం కోటిలింగాల ఎక్కడ చూసినా భక్తుల సందడితో కార్తీక శోభను సంతరించుకుంది.