- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Assembly: అడవి పందుల్లా రాష్ట్రాన్ని దోచుకున్నారు.. : సీఎం చంద్రబాబు ఫైర్
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థల్నీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu). బడ్జెట్ పై శుక్రవారం ఆయన అసెంబ్లీలో (Assembly) మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులే రాష్ట్రానికి శాపంగా మారాయన్నారు. రాష్ట్రాన్ని మళ్లీ ఆర్థికంగా నిలబెట్టాలనే కూటమిగా ఏర్పడి పోటీ చేసినట్లు తెలిపారు. 93 శాతం స్ట్రైక్ రేట్ తో గెలవడం ఒక చరిత్ర అని చెప్పారు. మోదీ, పవన్.. తనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, దాన్ని నిలబెట్టుకునేందుకే తనకు శక్తి ఉన్నంతవరకూ కృషి చేస్తానని తెలిపారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో చాలా సమస్యల్ని ఎదుర్కొన్నామని, మనకు లోటు కరెంట్ ఉండేదని గుర్తు చేశారు. ఆ పరిస్థితి నుంచి మిగులు కరెంట్ పరిస్థితికి తీసుకొచ్చామన్నారు.
2019లోనూ తామే గెలిచి ఉంటే.. పోలవరం (Polavaram) 2021లోనే పూర్తి చేసేవారమన్నారు చంద్రబాబు. ఒక్క ఛాన్స్ ఇవ్వండని అధికారం చేపట్టి.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం జీఓలను ఆన్లైన్ పెట్టలేదు, కాగ్ నివేదికలు లేవు, స్కామ్ ల కోసం స్కీమ్ లు, దోపిడీ కోసం వ్యవస్థల్ని నాశనం చేశారు. విభజన నష్టం కంటే.. ఐదేళ్లలోనే ఎక్కువ నష్టం జరిగిందని ఆరోపించారు. వేరుశెనగ పంటను అడవి పందులు నాశనం చేసినట్లు.. రాష్ట్రాన్ని వైసీపీ నాశనం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. అడవిపందులను చూసినప్పుడల్లా తనకు రాష్ట్రంలో జరిగిందే గుర్తొస్తుందన్నారు. పంట నాశనమైతే మళ్లీ వేసుకునే అవకాశం ఉంటుంది.. కానీ.. ఇక్కడ అలాంటి అవకాశాలు లేకుండా చేశారన్నారు. సంపద సృష్టించే పనులు చేయకపోగా.. అన్ని రంగాలను తిరోగమనంలో పెట్టారని వివరించారు.
రుషికొండ ప్యాలెస్ ను చూస్తే.. తనకు కళ్లు తిరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ ధనంతో ఇన్నివందల కోట్ల ప్యాలెస్ లు కట్టడం ఎంతవరకూ సమంజసం అని ప్రశ్నించారు. ఆ ఒక్కటే కాకుండా.. ఫ్యామిలీ మెంబర్స్ కు కూడా బిల్డింగులు కట్టారన్నారు. పర్యావరణాన్ని విధ్వంసం చేసి.. ఇలాంటివి చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ ప్రకటన్నింటినీ వాళ్ల పేపర్లకే ఇచ్చుకునే పరిస్థితికి వచ్చి.. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారన్నారు. ఇప్పుడు ప్రజలంతా కష్టాల్లో ఉన్నారని, వారిని వదిలేసి పారిపోలేనన్నారు. భావితరాల బంగారు భవిష్యత్ కు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని చెప్పారు.