స్మగ్లర్‌ల హైటెక్ తెలివి.. గోల్డ్‌ను తీగల చేసి సిల్వర్ కోటింగ్

by Mahesh |
స్మగ్లర్‌ల హైటెక్ తెలివి.. గోల్డ్‌ను తీగల చేసి సిల్వర్ కోటింగ్
X

దిశ, శంషాబాద్ : గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం చోటు చేసుకుంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుండి ఎమిరేట్స్ విమానంలో హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ప్రయాణికుడు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా ప్రయాణికుడిపై అనుమానం వచ్చి పూర్తిగా స్కాన్ చేశారు. అతని వద్ద బంగారం ఉన్నట్లు గుర్తించారు.

బంగారాన్ని ప్రయాణికుడు తీగల రూపంలో తయారు చేసి.. తీగలకు సిల్వర్ కోటింగ్ కొట్టి ట్రాలీ బ్యాగులో పెట్టుకొని బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నాడు. అతని వద్దనుండి కస్టమ్స్ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం రూ.13 లక్షలు 63 వేల విలువ చేసే 255.6 గ్రాములు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నమని తెలిపారు.

Advertisement

Next Story