yogasana: వెన్నునొప్పికే కాదు.. మరిన్ని ప్రయోజనాలు చేకూరుస్తోన్న బెస్ట్ యోగాసనం..!

by Anjali |   ( Updated:2024-11-20 07:35:24.0  )
yogasana: వెన్నునొప్పికే కాదు.. మరిన్ని ప్రయోజనాలు చేకూరుస్తోన్న బెస్ట్ యోగాసనం..!
X

దిశ, వెబ్‌డెస్క్: యోగా(Yoga) చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని.. మనసు తేలికగా ఉంటుందని తరచూ ఆరోగ్య నిపుణులు(Health professionals) చెబుతూనే ఉంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఉద్యోగం వల్ల ఒక ప్లేస్‌లో ఎక్కువ సమయం పాటు కూర్చుని వర్క్ చేస్తున్నారు. దీంతో చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం వల్ల దీర్ఘకాలం నడుము నొప్పి(Chronic back pain) వచ్చే అవకాశం ఉంటుంది.

అలాగే కొంతకాలానికి వెనుక భంగిమ కూడా సరిగా పనిచేయదు. అంతేకాకుండా కాలం గడుస్తోన్న కొద్ది.. నొప్పి మరింత పెరుగుతుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రతిరోజూ ఓ ఆసనం వేస్తే చాలంటున్నారు నిపుణులు. అదే మండూకాసనం(Mandukasanam). ఈ ఆసనం వేస్తే వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ ఆసనంలో పలు ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

మండూకాసనం వేయడానికి ముందుగా ఒక చోట నిటారుగా నిలబడి.. మీ రెండు కాళ్లను దూరంగా పక్కకు జరపాలి. తర్వాత కిందకు వంగి.. మోకాళ్లను నేలకు ఆనించి రెండు ముంజేతులను కూడా నేలకు ఆనించాలి. రెండు ముంజేతులు సమానంగా ఉండేలా చూసుకోవాలి. కాళ్లు ఒకదానికి ఒకటి దూరంగా ఉండాలి. రోజుకు ఒకసారి ఈ ఆసనాన్ని చేస్తే మీ వెన్ను నొప్పి తగ్గుతుంది. దీన్నే ఆంగ్లంలో ఫ్రాక్ పోజ్ అంటారు.

ఈ మండూకాసనం వేస్తే వెన్ను నొప్పి తగ్గడమే కాకుండా బాడీ ఫ్లెక్సిబులిటీ(Body flexibility) పెరుగుతుంది. శరీర బ్యాలెన్స్‌(Body balance)ను కూడా మెరుగుపరుస్తుంది. బ్లడ్ సర్కులేషన్(Blood circulation) సాఫీగా సాగుతుంది. మానసిక ఒత్తిడి(mental stress) తగ్గుతుంది. మంచి నిద్ర(good sleep)ను అందిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed