Shahrukh Khan:హంతకుడిగా బాలీవుడ్ అగ్ర కథానాయకుడు.. ఆసక్తికర కామెంట్స్ వైరల్

by Anjali |   ( Updated:2024-10-18 07:42:10.0  )
Shahrukh Khan:హంతకుడిగా బాలీవుడ్ అగ్ర కథానాయకుడు.. ఆసక్తికర కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ అగ్రకథానాయకుడు షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచే ఈ నటుడు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటిస్తూ.. తన నటనతో కోట్లాది మంది గుండెల్లో స్థానం దక్కించుకున్నాడు. గత ఏడాది కూడా వరుస హిట్లతో బాక్సాఫీసును షేక్ చేశాడు. తాజాగా ఈ హీరో ఓ క్యార్యక్రమంలో పాల్గొని పలు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ఈ ఈవెంట్‌లో షారుఖ్ తనకు ఇష్టమైన పాత్రల గురించి మాట్లాడారు. సినీ ఇండస్ట్రీకి వచ్చిన ఈ 30 ఏళ్లలో కంప్లీట్ గా యాక్షన్ చిత్రాల్లో నటించాలనే కోరిక జవాన్, పఠాన్ లతో కళ నెరవేరిందని షారుఖ్ వెల్లడించారు. అలాగే షారుఖ్ ఖాన్ అంటే అందరికీ ఒక హీరో అని మాత్రమే తెలుసునని అన్నాడు.

కానీ ఇప్పుడు ప్రేక్షకులకు ఒక చెడ్డ వ్యక్తిలా.. హంతకుడిగా కనిపించాలనుకుంటున్నానని తెలిపాడు. హంతకుడి పాత్రలో నటించాలని కోరిక ఉందని అన్నాడు. కాగా అలాంటి పాత్రల్లో చాన్స్ వస్తే అస్సలు మిస్ చేసుకోనని వెల్లడించాడు. ఇక షారుఖ్ తన కూతురు సుహానా సింగ్ తో కలిసి కింగ్ అనే సినిమాలో హంతకుడి పాత్రలో నటిస్తున్నారని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. మరీ ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియదు కానీ షారుఖ్ ఫ్యాన్స్ ఈగర్ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed