Sania Mirza: కోడ్ పింక్ అంటూ లవ్ సింబల్స్ జోడించి లేటెస్ట్ పిక్స్ పంచుకున్న టెన్నిస్ స్టార్

by Anjali |
Sania Mirza: కోడ్ పింక్ అంటూ లవ్ సింబల్స్ జోడించి లేటెస్ట్ పిక్స్ పంచుకున్న టెన్నిస్ స్టార్
X

దిశ, వెబ్‌డెస్క్: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా(Tennis star Sania Mirza) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. 15 ఏళ్ల కిందట పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌(Pakistani cricketer Shoaib Malik)కు వివాహం చేసుకుంది. వీరికి కుమారుడు (ఇజహానర్) జన్మించాడు. ఏమైందో తెలియదు కానీ కొన్ని నెలల కిందట సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్నారు. తర్వాత మాలిక్ పాకిస్తాన్‌కు చెందిన నటి సనా జావేద్‌(Actress Sana Javed)ను పెళ్లి చేసుకున్నారు. దీంతో షోయబ్ సనాతో రిలేషన్ వల్లే డివోర్స్ ఇచ్చాడంటూ.. సానియా ఓ ప్రముఖ క్రికెటర్‌తో రిలేషన్‌లో ఉందని.. ఇలా అనేక పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలు ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ.. తాజాగా సానియా మీర్జా సోషల్ మీడియా వేదికన తన లేటెస్ట్ ఫొటోలు పంచుకుంది. పింక్ కోడ్(Code Pink) అంటూ రెండు లవ్ సింబల్స్ జోడించి.. గులాబీ రంగు డ్రెస్‌లో అభిమానులతో ఫొటోలు పంచుకుంది. జనాల్ని ఆకట్టుకుంటోన్న సానియా డ్రెస్ వివరాలు కూడా పంచుతుంది. ప్రస్తుతం సానియా ఇన్‌స్టా పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed