Samantha: సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సమంత-రానా సెటైర్లు.. ఒకరిపై ఒకరు..!

by Anjali |   ( Updated:2024-11-07 12:24:04.0  )
Samantha: సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సమంత-రానా సెటైర్లు.. ఒకరిపై ఒకరు..!
X

దిశ, వెబ్‌డెస్క్: రీసెంట్‌గా అబుదాబి(Abu Dhabi)లో ఘనంగా జరిగిన ఐఫా(Ifa) వేడుకల్లో టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సమంత(Samantha) ఉమెన్ ఆఫ్ ది అవార్డు (Women of the Award)సొంతం చేసుకుంది. అలాగే ఈ కార్యక్రమానికి హీరో రానా అండ్ తేజా సజ్జ(Tējā sajja) హోస్ట్ గా చేశారు. సామ్ అవార్డు తీసుకున్నాక కాసేపు ఆమెతో సరదాగా మాట్లాడారు. సమంత, రానా అయితే ఒకరికి ఒకరు కౌంటర్ల మీద కౌంటర్లు వేసుకున్నారు. వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉన్న విషయం తెలిసిందే. కాగా చనువులో రానా, సామ్ ఒకరిపై మరొకరు కామెంట్స్ చేసుకున్నారు.

సామ్ ను మా సిస్టర్ ఇన్ లా నుంచి ఇప్పుడు సిస్టర్ వరకు వెళ్లింది అంటాడు రానా. తెలుగు మూవీస్ ఎందుకు చేయట్లేదని అడగ్గా.. తిరిగి నువ్వు ఎందుకు చేయట్లేదని సమంత.. రాను ప్రశ్నిస్తుంది. నన్ను ఎవరూ తీసుకోవట్లేదని రానా బదులిస్తాడు. సేమ్ నా పరిస్థితి కూడా అంతే అంటూ సమంత అంటుంది. అయినా మనం సినిమా చేస్తే నరసింహ నాయుడులా ఉండాలి కానీ రానా నాయుడు(Rana Naidu) లా కాదు అని సమంత అంటుంది. అది ఫ్యామిలీ మ్యాన్ (A family man) నుంచే చూసి నేర్చుకున్నానని రానా అంటాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed