స్ట్రాబెర్రీతో రోడ్డు.. దారంతా పరిమళభరితం!

by Manoj |   ( Updated:2022-07-10 07:33:51.0  )
స్ట్రాబెర్రీతో రోడ్డు.. దారంతా పరిమళభరితం!
X

దిశ, ఫీచర్స్ : రహదారి వేసినప్పుడు లేదా మరమ్మత్తుల సమయంలో వేడి తారు నుంచి వచ్చే వాసన చాలా మంది భరించలేకపోతుంటారు. ఈ ఇబ్బంది నుంచి బయటపడేందుకు గతంలో పోలిష్ కంపెనీ పూల సువాసనగల తారుతో రోడ్డు వేసి ఆశ్చర్యపరచగా.. తాజాగా రష్యాలోని లెనిన్‌గ్రాడ్‌కు చెందిన ఓ సంస్థ స్ట్రాబెర్రీ-సువాసన గల తారు రోడ్డు వేసింది. దాదాపు 700 మీటర్ల పొడవైన రహదారిని విజయవంతంగా పూర్తిచేసి.. స్థానికులకు తారు స్మెల్ నుంచి ఉపశమనం కలిగించింది.

లెనిన్‌గ్రాడ్‌లోని జిల్లాలో 700 మీటర్ల పొడవైన స్ట్రాబెర్రీ-స్మెల్ గల తారు రహదారి రష్యా సేఫ్ హై-క్వాలిటీ రోడ్స్ నేషనల్ ప్రాజెక్ట్‌లో భాగం. కాగా ఈ ప్రయోగం కోసం దాదాపు 300 టన్నుల స్ట్రాబెర్రీ-సువాసన గల తారు మిశ్రమాన్ని ఉత్పత్తి చేశారు. ప్రయోగం విజయవంతమైందా లేదా స్ట్రాబెర్రీల సువాసన ఎంతకాలం కొనసాగింది అనేది అస్పష్టంగా ఉండగా.. స్ట్రాబెర్రీ ఫ్రాగ్రెన్స్ తారు నాణ్యతను ఏమాత్రం ప్రభావితం చేయదని కాంట్రాక్టర్ పేర్కొన్నాడు.

Advertisement

Next Story

Most Viewed