- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీస్ యంత్రాంగంతో..ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: ఎంపీ
దిశ, హుజూర్ నగర్: అధికార పార్టీ నాయకులు అధికార, పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, బలహీన వర్గాలను పోలీసులతో అణిచి వేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ టీపీసీసీ అధ్యక్షుడు,నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని సబ్ జైలులో ఓ కేసులో రిమాండ్ చేయబడిన పోలేనిగూడెంకు చెందిన కాంగ్రెస్ నాయకులను శనివారం ఆయన కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కేవలం రాజకీయ కక్షపూరితంగా అమాయకులైన చిలుకూరు మండలం పోలేని గూడెంకు చెందిన గురునాథం గౌడ్,గోపి గౌడ్‌లపై తప్పుడు కేసులు బనాయించారని అన్నారు.
పోలీసులతో తమ రాజకీయాలు చేస్తూ దళిత, బిసి, గిరిజన, మైనారిటీలను అణచివేస్తున్నారని అన్నారు. వారు అధికార దుర్వినియోగం చేయడం దురదృష్టకరమని అన్నారు. వారికి ఎక్కువకాలం లేదని.. ఇది అధికార పార్టీ నాయకులకు వర్తిస్తుందన్నారు. ఆ తర్వాత ఎంపీ నిధులతో జైలులోని ఖైదీల అనారోగ్య సమయంలో హాస్పిటల్‌కు తరలించడానికి రూ.8 లక్షలతో కొనుగోలు చేసిన అంబులెన్స్‌ను ఆయన ప్రారంభించారు. తరువాత పట్టణంలోని రేషన్ దుకాణాలకు ప్రభుత్వం సప్లై చేస్తున్న బియ్యం నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖార్జున్, టీపీసీసీ నాయకులు ఈడ్పుగంటి సుబ్బారావు, కోతిసంపత్ రెడ్డి, శ్రవణ్, షేక్ సైదా, సులువ చంద్రశేఖర్, గుండు రామాంజిగౌడ్, జక్కుల మల్లయ్య, యల్లారెడ్డి, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.