సాగర్ నుండి శ్రీశైలానికి నీళ్ళు రివర్స్ పంపింగ్

by Manoj |
సాగర్ నుండి శ్రీశైలానికి నీళ్ళు రివర్స్ పంపింగ్
X

దిశ, ప్రతినిధి, మహబూబ్ నగర్ : శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయిన సందర్భంగా వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు గాను అధికారులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా చేరవేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు, వికారాబాద్ జిల్లాలోని పలు మండలాలకు తాగునీటి సమస్య ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని నివేదిక అందిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి అధికారులు అప్రమత్తంగా ఉండి తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ నేతృత్వంలో అధికారులు బుధవారం రాత్రి ఒక పంపు ద్వారా నాగార్జునసాగర్ నుండి శ్రీశైలానికి నీటిని రివర్స్ పంపింగ్ ప్రారంభించారు. శ్రీశైలం రిజర్వాయర్లో నాలుగు టీఎంసీల నీరు చేరేవరకు రివర్స్ పంపింగ్ కొనసాగే విధంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ పర్యవేక్షక ఇంజనీర్ వెంకటరమణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పెంటా రెడ్డి. జెన్ కో డైరెక్టర్ వెంకట రాజ్యం, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కృపాకర్ రెడ్డి, చెన్నారెడ్డి, తదితరులు నీటి రివర్స్ పంపింగ్ అంశంపై చర్చలు జరిపి పంపింగ్ విధానాన్ని పరిశీలించారు.

Advertisement

Next Story

Most Viewed