15 రోజుల్లో ఎయిర్ హారన్లు తీసేయండి : ఏవీ రంగనాథ్

by Nagaya |   ( Updated:2022-03-17 10:36:33.0  )
15 రోజుల్లో ఎయిర్ హారన్లు తీసేయండి : ఏవీ రంగనాథ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : భారీ శబ్ధాలతో విసిగిపోయిన నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు.నిత్యం జంట నగరాల పరిధిలోని రోడ్లపై లక్షలాది వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. వీటి నుంచే వచ్చే వెలువడే శబ్ధంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు, లారీలకు ఉండే ఎయిర్ హారన్‌ల ద్వారా వెలువడే శబ్ధం రోడ్డుపై ఉన్న వాహనదారులతో పాటు ఇళ్లలో ఉండే వారికి ఆరోగ్య పరంగా హానిని చేకూరుస్తున్నాయి. మోటారు వాహన చట్టం- సెక్షన్ 119 ప్రకారం ఎయిర్ హారన్లను వాడకూడదని అధికారులు చెబుతున్నారు.

ఈ క్రమంలో గత కొద్ది రోజుల క్రితం ఆర్టీసీ అధికారులు, ప్రైవేటు ట్రావెల్స్ యజమానులతో ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ జరిపిన సమావేశంలో ఎయిర్ హారన్ వాడకంపై చర్చ వచ్చినట్లు మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు ఇతర భారీ వాహనాలకున్న ఎయిర్ హారన్లను 15 రోజుల్లోగా తీసివేయాలని ఆదేశించినట్లు రంగనాథ్ పేర్కొన్నారు. ఇచ్చిన సమయం పూర్తైన తర్వాత దాడులు చేసి చలాన్లు విధిస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed