- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో రామ్ సహాయం మరువలేనిది: కృతి శెట్టి
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం కృతి శెట్టి ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన 'ది వారియర్' మూవీలో నటిస్తోంది. ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ లింగు సామి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూలై 14న విడుదల కానుంది. ఇక సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌లో భాగంగా కృతిశెట్టి సినిమా షూటింగ్‌లో తన అనుభవాలను పంచుకుంది.. కృతి మాట్లాడుతూ.. "నా మాతృభాష 'తుళు'.. అయితే తెలుగు బాగానే మాట్లాడతాను. దీనికి కారణం ఇంతవరకూ తెలుగు బాగా తెలిసిన దర్శకులతోనే సినిమాలు చేశాను.
అయితే లింగుసామిగారి తెలుగులో తమిళ యాస ఉంటుంది. నాకు అసలు తమిళమే తెలియదు. అందువలన ఆయన మాట్లాడే తెలుగు అర్థం అయ్యేది కాదు.. దాని వల్ల ఒక వారం రోజుల పాటు ఇబ్బంది పడాల్సివచ్చిందని తెలిపింది. రామ్ గారికి తమిళం కూడా బాగా వచ్చు. అందువలన ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆయన సపోర్ట్ తీసుకున్నాను. లింగుసామి గారు ఏం చెబుతున్నారనేది నాకు రామ్ గారు చెప్పేవారు. ఇక ఆ తరువాత నేను లింగుసామి తెలుగు యాసకు అలవాటు పడిపోయానని చెప్పుకొచ్చింది.