Rahul Gandhi: కేంద్రాన్ని విమర్శిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్

by S Gopi |   ( Updated:2022-08-29 09:43:22.0  )
Rahul Gandhis Tweet On Unparliamentary Words In Parliament
X

న్యూఢిల్లీ: Rahul Gandhi's Tweet On Unparliamentary Words In Parliament| పార్లమెంటులో పలు పదాల వాడకంపై నిషేధం నిర్ణయించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలకు దిగారు. దేశంలో కొత్త డిక్షనరీని తీసుకొచ్చారని కేంద్రంపై వ్యంగ్యస్త్రాలు విసిరారు. ఈ మేరకు అన్ పార్లమెంటరీ పదానికి కొత్త నిర్వచనం ఇస్తూ గురువారం ట్వీట్ చేశారు. 'అన్‌పార్లమెంటరీ పదాల' ప్రభుత్వంపై ప్రధానమంత్రి వ్యవహరిస్తున్న తీరును సరిగ్గా వివరించే చర్చలలో ఉపయోగిస్తారు. కానీ, ఇప్పుడు మాట్లాడకుండా నిషేధించారు' అంటూ డిక్షనరీలా కనిపిస్తున్న స్క్రీన్‌షాట్‌ను రాహుల్ ట్వీట్ చేశారు. అన్‌పార్లమెంటరీ వాక్యానికి ఉదాహరణగా నిషేధిత పదాలను కూడా ఉపయోగించారు. జుమ్లజీవి తనషా తన అబద్ధాలు, అసమర్థత బహిర్గతం అయినప్పుడు మొసలి కన్నీరు కార్చాడని ఉదాహరణ ఇచ్చారు. 'జుమ్లజీవి', 'బాల్ బుద్ధి', 'కోవిడ్ స్ప్రెడర్', 'స్నూప్‌గేట్' వంటి పదాలు పార్లమెంట్‌కు అనర్హమైనదిగా భావించే జాబితాలో ఉన్నాయి. 'సిగ్గు', 'దుర్వినియోగం, 'ద్రోహం', 'అవినీతి', 'డ్రామా', 'వంచన' వంటి రోజువారీ వ్యక్తీకరణలు కూడా ఉన్నాయి. టీఎంసీ ఎంపీలు డెరక్ ఒబ్రెయిన్, మహువా మొయిత్రా కూడా కేంద్రం నిర్ణయంపై విమర్శలు చేశారు. తాను తప్పనిసరిగా నిషేధించిన పదాలను వాడుతానని, దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని డెరక్ ఒబ్రెయిన్ సవాలు విసిరారు. మరో ఎంపీ మహువా మెయిత్రా కేంద్రాన్ని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. 'మీ ఉద్దేశ్యంలో నేను లోక్‌సభలో నిలబడలేను. వారి కపటత్వానికి సిగ్గుపడాల్సిన అసమర్థ ప్రభుత్వం భారతీయులను ఎలా మోసం చేసిందో చెప్పగలనా?' అంటూ పేర్కొన్నారు. కాగా, వచ్చే సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Also Read: ఇద్దరు పిల్లల విధానంపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed