జోరుగా వ్యవసాయ మోటార్ల చోరీ.. అలా చేస్తూ దొరికిపోయిన దొంగలు

by Javid Pasha |
జోరుగా వ్యవసాయ మోటార్ల చోరీ.. అలా చేస్తూ దొరికిపోయిన దొంగలు
X

దిశ, కోదాడ : సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 8 మండలాల్లో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలాల్లో 75 కరెంటు మోటార్లు దొంగతనం చేసిన కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు కోదాడ పట్టణంలో రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురం కాలనీకి చెందిన ఏడుగురు, చిలుకూరు మండలం సీతారామపురం గ్రామానికి చెందిన ఒకరు ఇంటి స్లాబ్ కూలగొట్టే పనికి వెళ్లే వారు. ఈ క్రమంలో అక్కడ పని చేస్తున్నప్పుడు దొరికే ఇనుప సువ్వలను కేజీల చొప్పున పాత ఇనుము కొనే వాళ్లకు అమ్ముకునే వాళ్ళు. ఈ క్రమంలో వారందరికీ ఒక రోజు పాత ఇంటి స్లాబ్ కూలగొడుతున్న క్రమంలో ఇంటి వద్ద వారికి పాడుబడిన ఎలక్ట్రిక్ మోటార్ దొరకగా మొదట దానిని 2500 రూపాయలకు విక్రయించారు.

నగదు చూసిన వెంటనే ఇదేదో బావుంది అనుకొని దొంగతనాలు చేస్తే సులువుగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకున్నారు. కుటుంబ అవసరాలు, విలాసాలను తీర్చుకోవడానికి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటినుండి సంపంగి నవీన్, దారంగుల శ్రీను పగటిపూట ద్విచక్రవాహనంపై ఎక్కడెక్కడ పంట పొలాల్లో వ్వవసాయ కరెంటు మోటార్లు ఉన్నాయో చూసుకొని వచ్చేవారు. రాత్రి సమయంలో అందరూ కలిసి ఆటోలో వెళ్లి వాటిని దొంగలించేవారు. ఆ మోటార్లను గ్రామాల్లో గుర్తుతెలియని వ్యక్తులకు అమ్ముతూ ఉండేవారు. ఈ విధంగా 29 కేసుల్లో 75 మోటార్లను దొంగిలించారు.


తీగలాగితే డొంక కదిలే..

ఇదే క్రమంలో శనివారం ఉదయం నవీన్, శ్రీను, యాదగిరితో పాటు నాగరాజు కలిసి సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం మొగలైకోట గ్రామ శివారులో దాచిపెట్టిన మోటార్లు తీసుకురావడానికి వెళ్లారు. ఆటోలో రెండు మోటార్లను, మోటార్ సైకిల్‌పై ఒక మోటార్ తీసుకుని వస్తుండగా.. ఉదయం సమయం నాలుగు గంటల ప్రాంతంలో అనంతగిరి గ్రామ శివారులో గల సత్యనారాయణ స్వామి క్రషర్ మిల్లు వద్ద పోలీసులకు అనుమానం వచ్చి మోటార్ సైకిల్‌ను ఆపి, విచారించగా తమ నేరం ఒప్పుకున్నారు. మిగిలిన నేరస్తులు పరారీలో ఉన్నారు. ఆయన వెంట డీఎస్‌పీ రఘు, స్పెషల్ బ్రాంచ్ ఎస్‌బి‌సీఐ శ్రీనివాస్, రూరల్ సీఐపిఎన్‌డి ప్రసాద్, టౌన్ సీఐ నరసింహారావు, మునగాల సీఐ ఆంజనేయులు, హుజూర్నగర్ రామలింగారెడ్డి, పట్టణ, రూరల్ నడిగూడెం, అనంతగిరి ఎస్ఐలు నాగభూషణరావు, రాంబాబు, సాయి ప్రశాంత్, ఏడుకొండలు, సత్యనారాయణ గౌడ్ సిబ్బంది ఉన్నారు.

అభినందించిన జిల్లా ఎస్పీ..

కరెంటు మోటార్లను దొంగిలించిన కేసులో కోదాడ డీఎస్పీ ఆధ్వర్యంలో చాకచక్యంగా వ్యవహరించిన కోదాడ రూరల్ సీఐ పిఎన్ డి ప్రసాద్, అనంతగిరి ఎస్ఐ సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ రామారావు, బండి శ్రీనివాస్, కుంభం శ్రీను, జానీ పాషాలను ఎస్పీ రాజేంద్రప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Next Story