శ్రీలంకలో ఆందోళనలపై కేంద్రమంత్రి జైశంకర్ వ్యాఖ్యలు..

by Manoj |
శ్రీలంకలో ఆందోళనలపై కేంద్రమంత్రి జైశంకర్ వ్యాఖ్యలు..
X

తిరువనంతపురం: శ్రీలంకలో ప్రజల నిరసనలతో అట్టుడుకుడుతున్న నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎలాంటి శరణార్థుల సంక్షోభం లేదని అన్నారు. శ్రీలంకకు ఎల్లప్పుడూ భారత ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని నొక్కి చెప్పారు. త్రివేండ్రంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

వారికి కావాల్సిన సాయాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. వారు ప్రస్తుతం వారు తమ సమస్యలను పరిష్కరించుకుంటున్నారని, వేచి చూడాలని చెప్పారు. తన పార్టీ సహచరులతో సమయం సమావేశమై, వారు ఎలా పని చేస్తున్నారో, ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశమంతటా పార్టీ పనితీరు మెరుగ్గానే ఉందని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed