- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో నా భర్త అస్సలు కోపరేట్ చేయడు స్టార్ హీరోయిన్ హాట్ కామెంట్స్..
దిశ, వెబ్డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధికా అప్టే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులో లయన్, లెజెండ్ సినిమాల్లో కూడా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సినిమాల గురించి అన్ని విషయాలు షేర్ చేసుకున్నా పర్సనల్ విషయాలు మాత్రం అస్సలు షేర్ చేసుకోదు. రాధికా అప్టే 2012లోనే బ్రిటీష్ మ్యూజిక్ డైరెక్టర్ బెనెడిక్ట్ టేలర్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను తెలిపింది.
రాధికా అప్టే మాట్లాడుతూ ''నేను ఇక్కడ ఉంటాను. బెనెడిక్ట్ అక్కడ ఉంటాడు. మేము ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం. నా వ్యక్తిగత విషయాలు బయటకుచెప్పడం నాకు అంతగా ఇష్టముండదు. నాకు ఫొటోలపై అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నాకన్న బెన్ కి ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు, ఫొటోలు అంటే అస్సలు కోపరేట్ చేయ్యడు. అందుకే మా పెళ్లి అయి పదేళ్లు అవుతున్నా మావి ఎక్కువ ఫోటోలు ఉండవు. అసలు మా పెళ్లి ఫొటోలు కూడా లేవు. మా పెళ్ళికి చాలా తక్కువ మందిని పిలిచాం. మా స్నేహితుల్లో సగం మంది ఫొటోగ్రాఫర్లే, అయినా మా ఇద్దరికీ ఫొటోలు దిగేంత ఆసక్తి లేదు'' అంటూ చెప్పుకొచ్చింది. అది తెలుసుకున్న నెటిజన్స్ ఎప్పుడో ఒకసారి కలుసుకుంటూ ఇంకా బంధం కొనసాగిస్తున్నారంటే చాలా గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.