- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసును సీబీఐకి అప్పగించాలి
దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యాప్రయత్నం కేసును సీబీఐకి అప్పగించాలని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు. గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే ఇబ్రహీం పట్నం భూముల విషయంలో ఇద్దరు రియాలర్ట్ లను షార్ప్ షూటర్లు చంపిన ఉదాంతం సంచలనం, భయాందోళన కలిగిస్తుండగా, ఉద్యోగ సంఘాల నాయకుడు ఉద్యమకారుడు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై మహబూబ్ నగర్ టీమ్ ఒకటి హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించడం తీవ్రంగా పరగణించాలన్నారు. ఇప్పటికే పాలమూరు జిల్లాలో గతంలో మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం హత్య జరిగిందన్నారు. మొన్నటి దాకా కాంగ్రెస్ లో ఉండి టీఆర్ఎస్ లో చేరిన ప్రస్తుత మహబూబ్ నగర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ అమరేందర్ రాజు, ఆయన ముగ్గురు తమ్ముళ్లు, బీజేపీ ముఖ్య నాయకులు, మాజీఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ కూడా ఉన్నారన్నారు.
స్టీఫెన్ రవీంద్ర వెల్లడించిన పేర్లలో తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ కోసం రక్తం చిందించే మున్నూరు రవి ఉన్నాడని, బీహార్ గ్యాంగ్‌ల పర్యవేక్షణలో రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని ప్రతిపక్షాల నాయకులు కూడా ప్రకటించడం ఆందోళన కలిగిస్తుందన్నారు. గ్యాంగులు కట్టడంలో, రూ.15 కోట్లకు ఎదిగిన సుపారీలతో నయీంకు వారసులుగా తెలుగు వారు నేర చరిత్రలు, కథలు అల్లడం, గ్రేహౌట్స్ గా విరుచుకుపడటంలో తెలుగు పోలీసులు ఎవరికంటే తక్కువేం కాదన్నారు. తెలంగాణ రాజకీయాలను వేడెక్కించిన మంత్రిపై హత్యా ప్రయత్నం కేసీఆర్ పార్టీ అంతర్గత వ్యవహారం కాదని, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, అమిత్ షా పై ఒత్తిడి పెంచి సీబీఐ ఎంక్వైరీ చేయించి తాము నిర్దోషులమని నిరూపించుకోవాల్సిన అనివార్యత ఉన్నదన్నారు. తెలంగాణ రాజకీయ భవిష్యత్ కు కూడా ఇది అవసరమని భావిస్తూ సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.