- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో వివాదంలో మంత్రి మల్లారెడ్డి.. పాఠశాలలో విద్యార్థులతో అలా చేయిస్తారా..? (వీడియో)
దిశ, శామీర్ పేట్ : వరుసగా వివాదాలు చుట్టుముడుతున్నా మంత్రి మల్లారెడ్డి వ్యవహారశైలిలో మార్పు రావడం లేదు. మొన్న రెడ్డి గర్జన వివాదం సర్ధుమనుగుతుండగానే క్యాసివో నిర్వహకుల కార్లకు ఎమ్మెల్యే స్టిక్కర్ వివాదం నడిచింది. తాజాగా ఓ పాఠశాలలో విద్యార్థులతో సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు అనుకూలంగా జై కొట్టించి మరో వివాదంలో చిక్కారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన లక్ష్మాపూర్ జడ్పీహెచ్ఎస్లో సోమవారం సరస్వతి మాత విగ్రహ ప్రతిష్ట, ఐఐఎల్ కంపెనీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు.
అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లను పొగుడుతూ పాఠశాల విద్యార్థుల చేత జేజేలు కొట్టించారు. విద్య గురించి మంచి మాటలు చెప్పాల్సింది పోయి పార్టీ పాఠాలు చెప్పడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. కనీసం విద్యార్థులు పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యలు, వసతుల కల్పన గురించి అడగకపోవడం విస్మయానికి గురి చేసింది. ఇలా ఎప్పటికప్పుడు మంత్రి మల్లారెడ్డి అనూహ్య వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో నిలుస్తూనే ఉన్నారు. ఇక్కడ మంత్రి మల్లారెడ్డి రూటే సపరేట్ అని ప్రజలు సైటర్లు వేసుకుంటున్నారు. విద్యార్థులు జిందాబాద్ కొడుతుంటే స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు వత్తాసు పాలికుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.