పెళ్లి అయ్యి జస్ట్ వన్‌మంతే.. అప్పుడే అతడి భార్య వేరొకరితో..

by S Gopi |
పెళ్లి అయ్యి జస్ట్ వన్‌మంతే.. అప్పుడే అతడి భార్య వేరొకరితో..
X

దిశ, వెబ్ డెస్క్: పెళ్లి అయిన నెల రోజులకే భర్తను భార్య వదిలేసి ప్రియుడితో పారిపోయింది. అనంతరం అతడిని పెళ్లి చేసుకుంది. దీంతో భర్త, బంధువులు షాకయ్యారు. ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా వేంగికాల్ కు చెందిన యువకుడికి మ్యారేజ్ అయ్యి నెల రోజులవుతోంది. అయితే, అతడి భార్య ఇంట్లో కనిపించలేదు. దీంతో వాళ్లంతా ఆందోళన చెందుతూ అంతా వెతికారు. అయినా కూడా ఆమె ఆచూకీ లభ్యమవ్వలేదు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి వాళ్లంతా అవాక్కయ్యారు. ఇంట్లో నుంచి వెళ్లిన ఆమె తన ప్రియుడితో వెళ్లిపోయిందని, ఆ తర్వాత అతడిని రెండో వివాహం చేసుకున్న ఆమె పోలీసులను ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాలని కోరింది. ఈ విషయాన్ని కోర్టులో నిర్ణయించుకోవాలని అక్కడి పోలీసులు సలహా ఇచ్చి పంపారు.

Advertisement

Next Story