- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాలీవుడ్ సినిమాపై మనసుపారేసుకున్న హాలీవుడ్ డైరెక్టర్.. మాంత్రికుడి లీలలు చూసి!
దిశ, సినిమా : మాలీవుడ్ క్లాసికల్ ఫిల్మ్ 'కుమ్మట్టి' సినిమాపై హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మార్టిన్ స్కోర్సెస్ ప్రశంసలు కురిపించాడు. 1979లో జీ అరవిందన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ప్రీమియర్ షోస్.. 'ది ఫిల్మ్ ఫౌండేషన్ రీస్టోరేషన్ స్క్రీనింగ్ రూమ్' క్రింద రీస్టోర్ చేస్తామని పేర్కొన్నాడు. 'కుమ్మట్టి అనేది కేరళ జానపద కథకు అనుకరణ. పాక్షిక పౌరాణిక చిత్రం మాంత్రికుడి మాయాజాలం గురించి వివరిస్తుంది.
మలబార్ ప్రాంతంలో చేతబడి ద్వారా చిన్నపిల్లలను జంతువుగా మార్చే మాంత్రికుడి కథే సినిమా కాగా.. స్వీట్ అండ్ ఎంగేజింగ్ స్టోరీ కలిగిన ఈ విజువల్ స్టన్నింగ్ మూవీని అందరూ తప్పకుండా చూడాలి. భారతదేశం వెలుపల ఎక్కువగా అందుబాటులో లేదు కాబట్టి స్పెషల్ ప్రీమియర్ షోస్ వేస్తాం' అని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపాడు. దీనిపై స్పందిస్తున్న మలయాళీస్.. హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ స్కోర్సెస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇది మల్లూస్‌కు ప్రౌడ్ మూమెంట్ అని మురిసిపోతున్నారు.