- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మతోన్మాద గుండాలకు భయపడను.. మణిమేకలై
దిశ, సినిమా: ఇటీవల లీనా మణిమేకలై విడుదల చేసిన 'కాళీ' పోస్టర్ తీవ్ర విమర్శలపాలవుతున్న సంగతి తెలిసిందే. కాగా కొంతమంది హిందుత్వ వాదులు లీనాపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేయగా.. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు ఆ ట్వీట్‌ను డిలీట్ చేయాలంటూ ట్విట్టర్‌పై ఒత్తిడి చేయడం చర్చనీయాంశమైంది. దీంతో తనదైన స్టైల్‌లో స్పందించిన ఫిల్మ్ మేకర్ విమర్శకులకు బేఫిట్టింగ్ రిప్లయ్ ఇచ్చింది. 'నా కాళీ క్వీర్. స్వేచ్ఛ స్ఫూర్తిని కలిగివుంది.
పితృస్వామ్యంపై ఉమ్మేస్తుంది. హిందూత్వాన్ని కూల్చేస్తుంది. పెట్టుబడిదారి విధానాన్ని నాశనం చేస్తుంది. వేయి చేతులతో ప్రజలందరినీ కౌగిలించుకుంటుంది. నన్ను ద్వేషించే బానిసల కన్నా నేను ఎక్కువ శక్తిని కలిగివున్నాను. నేను కళాకారిణిగా ఏదైనా సృష్టిస్తాను. మతోన్మాదంతో ఈ కిరాయి గుండాలు వివాదాలకు ఆజ్యం పోస్తున్నా.. నాకు మద్దతిచ్చే మేధావులు ఎంతో మంది ఉన్నారని తెలుసు' అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
"FIRs" Bring them all!
— Leena Manimekalai (@LeenaManimekali) July 9, 2022
"Look out notice" - where is it?
"Beheading threat" - I only have one head.
I am an artist.I create.Compassion is my language.
I wield more power than any slaves of hate.
I know, I've more people by my side, my art,than this mercenary oiled by bigotry.