- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిల్లలపై సోషల్ మీడియా ఎఫెక్ట్..పేరెంట్స్‌లో భయం!
దిశ, ఫీచర్స్ : ఈతరం పిల్లలు మునపటి తరాల కంటే వేగంగా ఎదుగుతున్నారా? లేదా నెమ్మదిగానే? అంటే తరాలు గడిచేకొద్దీ, యువకులు వృద్ధులుగా ప్రవర్తిస్తున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ దృగ్విషయాన్ని 'పిల్లలు పెద్దవారవుతున్నారు' (KGOY-Kids Getting Older Younger) అని పిలుస్తున్నారు. ఈ రోజుల్లో పిల్లలు పిల్లల్లా ఉండట్లేరనే వాస్తవం ఎంతోమంది గ్రహిస్తున్నదే, అనుభవిస్తున్నదే. సగటు తల్లిదండ్రులు తమ పిల్లలకు 10 ఏళ్ల వయస్సులోనే స్మార్ట్‌ఫోన్ అందించడం ద్వారా వారికి కొత్త ప్రపంచాన్ని అందిస్తుండటంతో.. యుక్తవయస్సు రాకముందే భావోద్వేగ పరిపక్వత చెందుతున్నారు. అదేవిధంగా సెక్స్, డేటింగ్, మద్యం సేవించడం, తల్లిదండ్రులు లేకుండా బయటకు వెళ్లడం వంటి 'వయోజన' కార్యకలాపాల్లో నిమగ్నమైపోతున్నారు. సాంకేతికత పిల్లలను మేధోపరమైన అవగాహన కలిగిస్తున్నదే నిజమైతే వారు గత జనరేషన్స్ కంటే వేగంగా పెరుగుతున్నారా? అసలు వేగంగా పెరగడం అంటే ఏమిటి?
గత తరాల కంటే ప్రస్తుత తరం చిన్నారులు వేగంగా పెరుగుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడించిన విషయం వాస్తవమే అయినా ఆ చర్చకు ముందు అసలు బాల్యాన్ని, యుక్తవయసును ఏ విధంగా కొలమానం చేయొచ్చు. అంటే దేశాన్ని బట్టి 'చైల్డ్‌హుడ్' ఏజ్ మారుతోంది. ఈ మేరకు చాలా దేశాల్లో 18ఏళ్లు నిండిన వ్యక్తులను పెద్దలుగా పరిగణిస్తే, జపాన్‌లో 20 ఏళ్లు వచ్చే వరకు చట్టబద్ధంగా పిల్లలే. ఇక ఇరాన్ విషయానికొస్తే.. అక్కడ తొమ్మిది సంవత్సరాల వయస్సు గల వ్యక్తులను చట్టపరంగా పెద్దలుగా పరగణిస్తారు. వయసు మాత్రమే కాదు చారిత్రాత్మకంగా 'బాల్యం' నిర్వచనాలు కూడా మారుతూ ఉన్నాయి. 19వ శతాబ్దంలో పదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు పని చేయడం సర్వసాధారణం కాగా 'యుక్తవయస్సు' అనే ఆలోచన 1940ల వరకు నిజంగా లేదు. ఈ నేపథ్యంలో మరింత త్వరగా ఎదుగుతున్నారనే విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం. అంటే 'పిల్లల అభివృద్ధి ప్రాథమిక దశలు మారడం లేదు. కానీ బాహ్య ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది. పిల్లల ప్రతిభ, భావోద్వేగ మైలురాళ్లు అలాగే ఉంటాయి. అదే సామాజిక, సాంస్కృతిక కోణంలో 'ఎదుగుతున్న' ఆలోచనను కొలవడం, లెక్కించడం కష్టం. బాల్యంలో అనేక (సాంస్కృతిక, భాషా, అభివృద్ధి) అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. అందువల్ల పిల్లలు త్వరగా ఎదుగుతారనే దానిపై ప్రాథమిక ప్రభావంగా ఏదైనా ఒక విషయాన్ని గుర్తించడం దాదాపు అసాధ్యం' అని న్యూయార్క్‌లోని పరిశోధనా బృందం సెంటర్ ఫర్ చిల్డ్రన్ అండ్ టెక్నాలజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ షెల్లీ పాస్నిక్ పేర్కొన్నారు.
లాభదాయకమే!
మునుపటి తరాల తల్లిదండ్రులు తమ పిల్లలు టెలివిజన్ చూడటం గురించి ఆందోళన చెందితే, ఈతరం తల్లిదండ్రులు తమ పిల్లలు సోషల్ మీడియా చూడటం వల్ల జంకుతున్నారని నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే చిన్న వయస్సులోనే హింసాత్మక లేదా లైంగిక కంటెంట్‌కు ఎక్కువ బహిర్గతం కావడం వల్ల ఇది డీసెన్సిటైజేషన్, సాధారణీకరణకు కారణమవుతుందని ఆందోళన చెందుతున్నారని.. ఆ భయాలను పక్కన పెడితే నిజానికి, మునుపటి తరాలకు అందుబాటులో లేని కంటెంట్‌కు యాక్సెస్ దొరకడం మంచి విషయమేనని నిపుణులు అంటున్నారు. పిల్లలు స్వతంత్రంగా జ్ఞానాన్ని పొందేందుకు, వైడ్ రేంజ్ సోర్స్ యాక్సెస్ కారణంగా అది వారిని విమర్శనాత్మకంగా ఆలోచించేలా చేస్తుందని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లోని పిల్లలు కూడా తమకు తెలియని మరింత జ్ఞానం పొందేందుకు వీలుదక్కడంతో పాటు, సోషల్ రిలేషన్‌షిప్స్ పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు.
పిల్లలు ఎలా అభివృద్ధి చెందుతారు, ఎంత వేగంగా డెవలప్ అవుతారు అనే విషయాలను ప్రభావితం చేసే ఏకైక శక్తిగా 'టెక్నాలజీ' లేదన్నది సత్యం. కానీ ఈతరం పిల్లలు మునుపటి తరాల కంటే మరింత నిర్మాణాత్మక ఆటలు, పాఠ్యేతర కార్యకలాపాల్లో ముందుంటున్నారన్నది ఒక వాదన కాగా పిల్లలు నిజంగా చాలా నెమ్మదిగా పెరుగుతున్నారు. కేవలం డిజిటల్ ప్రపంచం ద్వారానే యవ్వనంగా ఉంటున్నారన్నది మరో వాదన. అంతిమంగా టెక్నాలజీ కాకుండా పిల్లల పరిపక్వత రేటును ప్రభావితం చేసే అనేక అంశాలు ఉన్నాయన్నది నిజం. పరిస్థితులు చాలా వ్యక్తిగతమైనవి. బాల్యం ఎక్కడ ముగుస్తుంది, యుక్తవయస్సు ఎప్పుడు ప్రారంభమవుతుందనే మన అవగాహన, వాటిని వేరు చేసే అంశాలు భిన్నంగా ఉంటాయి. ఏదేమైనా సమాజం స్థిరంగా ఉండదు, ఇది నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటుంది, కాబట్టి బాల్యం కూడా నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. వాస్తవానికి టిక్‌టాక్, ఇన్‌స్టా, యూట్యూబ్.. వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నింట్లోనూ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో వారికి నచ్చిన వాటిని చూస్తున్నారు. దీనివల్ల ఎటువంటి హాని లేనప్పటికీ, పిల్లలు కొన్ని అంశాల్లో పిల్లలుగా ఉండటం ముఖ్యం, ఆ హద్దు దాటితేనే అనర్థమని సామాజికవాదులంటున్నారు.