- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుంభస్థలంపైనే గురిపెట్టిన కేజ్రీవాల్..
దిశ, వెబ్‌డెస్క్: నాకు రాజకీయం చేయడం తెలీదు.. ఆప్ ప్రతి సభలోనూ అరవింద్ కేజ్రీవాల్ పదేపదే చెప్పేమాట ఇది. దాని తర్వాత కేజ్రీవాల్ చెప్పేమాట విశేషంగా జనాలను ఆకట్టుకునేది. కానీ నాకు పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించటం తెలుసు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు గెల్చుకున్న నాటి కేజ్రీవాల్‌కి, పంజాబ్‌లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు గెలిచిన అరవింద్ కేజ్రీవాల్‌కి తేడా ఏమిటి అంటే ఒక్కసారిగా ఆప్ అధినేత జాతీయ రాజకీయాల్లో వెలిగిపోవడమే. ముఖ్యంగా పంజాబ్‌లో అఖండ మెజారిటీతో ప్రజా హృదయాలను గెల్చుకున్న ఆప్ రాడార్లోకి ఇప్పుడు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ వచ్చేశాయి.
ప్రత్యేకించి ఈ సంవత్సరం చివరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడటానికి ఆప్ సర్వశక్తులు సిద్ధం చేసుకుని రంగంలోకి దిగిపోయింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌తో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కాదు, గుజరాత్ కుంభస్థలాన్ని కొట్టే లక్ష్యంతోనే ఆప్ అధినేత కేజ్రీవాల్, పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా ఎంపికైన భగవంత్ మాన్ ఏప్రిల్ నెలలో గుజరాత్ పర్యటనకు సిద్ధమవుతున్నారు.
కాంగ్రెస్‌ని ఖాళీ చేయడమే ఆప్ ఉద్దేశం
అయితే గుజరాత్‌లో పంజాబ్‌లో లాగా తప్పక విజయం సాధిస్తామనే భ్రమలు మాత్రం ఆప్‌కి లేవు కానీ, మోదీ ప్రధానిగా ఎంపికై జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోయిన తర్వాత గుజరాత్ పరిస్థితి చాలా మారిపోయందని ఆప్ లెక్కలు వేసుకుంటోంది. ముఖ్యంగా పాటిదార్ల ఆందోళన తర్వాత 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుజరాత్‌లో గణనీయంగా బలం పుంజుకుంది. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాంగ్రెస్ ఢీలాపడిపోవటంతో గుజరాత్‌లో ఏర్పడిన శూన్య ఆవరణలో కాలుపెట్టాలని ఆప్ భావిస్తోంది. ఇప్పటికీ పురపాలక ఎన్నికల్లో పటేల్ బెల్ట్‌లో 27 స్థానాలు గెల్చుకుని తన ప్రభావాన్ని చూపిన ఆప్ సౌరాష్ట్ర బెల్ట్‌లో బలంగా కాలుమోపి ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టించింది.
పైగా ఢిల్లీలో కూడా కాంగ్రెస్ ఓట్లు ఆప్ వైపు మొగ్గు చూపటం ద్వారానే సునాయాసంగా గెల్చిన అనుభవం ఉంది. కాబట్టి 2017 నాటి మున్సిపల్ ఎన్నికల్లో సాపేక్షంగా మంచి ప్రదర్శన ఇచ్చిన కాంగ్రెస్ ఈసారి గుజరాత్ ఎన్నికల్లో మంచి పనితీరు ప్రదర్శిస్తే కచ్చితంగా ఆప్ అవకాశాలు దెబ్బతింటాయి కాబట్టే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల కంటే గుజరాత్ ఎన్నికల పైనే ఆప్ తన దృష్టినంతటినీ కేంద్రీకరిస్తోంది. అందుకే పంజాబ్‌లో గెలుపు ఇతర రాష్ట్రాల్లో అడుగుపెట్టడానికి ఆప్‌కి తలుపులు తెరిచిందనీ.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో గెలుపొందితే ఉత్తరభారత్ మొత్తంగా పలుకుబడి పెరుగుతుందని ఆప్ అంచనా వేసుకుంటోంది.
ప్రత్యామ్నాయం చూపించకుండా గుజరాత్‌ని గెలవలేం..
దేశంలో ప్రతి చిన్నా పెద్దా రాజకీయ పార్టీ కూడా బీజేపీని ఓడించడమే లక్ష్యంగా చేసుకున్నాయి కానీ ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపకుండా బలమైన ప్రత్యర్థిగా ఉన్న బీజేపీని ఎదిరించడం అంత సులభం కాదని ఆప్ స్పష్టంగా గ్రహించింది. ప్రజా సమస్యలపట్ల నిజమైన దార్శనికత లేకుండా బీజేపీ ఓటమే లక్ష్యంగా పెట్టుకుంటే ఫలితం గుండుసున్నాయే అప్ నాయకత్వం గ్రహించింది. ఆ దార్శనికతను ప్రజలకు అందించటమే లక్ష్యంగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఆప్ అడుగుపెట్టింది. అందుకే కేజ్రీవాల్ గుజరాత్‌లో తమ పోటీ ప్రధాని మోదీపై కాదని, మోదీ తమకూ ప్రధాని అని, దేశ నేత అని గౌరవంగానే ముందస్తు నమస్కార బాణాలు విసిరారు. అదే సమయంలో గుజరాత్ పట్ల తమ దృక్పథాన్ని కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బలంగా ప్రజల ముందుకు తీసుకుపోనుంది.
2013లో ఢిల్లీ అసెంబ్లీలో 28 స్థానాలు గెల్చుకున్నప్పుడే తన జాతీయ ఆకాంక్షను ఆప్ చాటుకుంది. 2014లో 400 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన ఆప్‌కు షాక్ కలిగించింది.. ఇప్పుడు క్లీన్‌గా ఉండటం, సమర్థవంత పాలనను అందించడం అనేవి సత్పరిపాలనకు సంకేతాలయ్యాయి కాబట్టి ఈ పునాదిపైనే ఆప్ ప్రతి రాష్ట్రంలోనూ అడుగుపెట్టాలని కోరుకుంటోంది. ఈ కోణంలోంచి చూస్తే పంజాబ్ ఎన్నికల ఫలితాల కంటే రేపు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఆప్ భవిష్యత్తుకు కీలకం కానున్నాయని భావిస్తున్నారు.
ఇప్పటికే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లకు కార్యకర్తలను పంపిన ఆప్ ఈ రెండు రాష్ట్రాల్లో బలమైన ప్రభావం కలిగించాలని భావిస్తోంది. ఈ రెండు పార్టీలు తమ రాడార్‌లో ఉన్నాయని ఆప్ నాయకత్వం తేల్చి చెప్పింది. దశాబ్దాలుగా భారత ప్రజలు తమకు పెద్దగా ఒరగబెట్టని రెండు పార్టీలనే ఎంపిక చేసుకుంటున్నారని, కానీ మొదటిసారిగా ఆప్ రూపంలో ఒక ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నారని ఆప్ భావన. పైగా ప్రజలు స్పష్టంగానే మార్పును కోరుకుంటున్నారు. కాబట్టి పార్టీ పనితీరు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభావితం చేస్తుందని ఆప్ నాయకత్వ భావన. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఆప్ వ్యూహం ఏమేరకు ఫలిస్తుందనేదాన్ని బట్టి భారత రాజకీయాలు ఏ మూలమలుపు తిరుగనున్నాయన్నది తేలనుంది.