- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
12 వేలకు పైగా వాటిని సేకరించాడు.. దాచడానికి బేస్‌మెంట్‌లో ప్లేస్!
దిశ, వెబ్‌డెస్క్ః ఏలాంటి వస్తువునైనా సేకరించడం అంత సులువైన విషయం కాదు. ఒక్కోసారి రూపాయి విలువ చేసే దాని కోసం వేల రూపాయలు, రోజుల కొద్దీ సమయం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలా కళాత్మక, పురాతన వస్తువులు, స్టాంపులు, ఇతర ప్రత్యేకమైన వస్తువులను సేకరించేవారు కొద్ది మందే కనిపిస్తారు. అయితే, సోడా క్యాన్ కలెక్షన్ చేయడం వీటన్నింటీలో మరింత ప్రత్యేకంగా, ఆసక్తికరంగా కనిపిస్తుంది. అలా, ఇటలీకి చెందిన క్రిస్టియన్ కావలెట్టి అనే వ్యక్తి ఇప్పటి వరకూ 12,402 పెప్సీ డబ్బాలు సేకరించి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు.
గిన్నిస్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, క్రిస్టియన్ కావలెట్టి 1989లో ఇలా పెప్సీ టిన్‌లను సేకరించడం ప్రారంభించాడు. ఈ సేకరణలో ప్రపంచం నలుమూలల నుండి పెప్సీకి సంబంధించిన రకరకాల టిన్‌లు, లిమిటెడ్ ఎడిషన్‌లు ఉన్నాయి. 81 వేర్వేరు దేశాల నుండి సేకరించిన పెప్సీ క్యాన్‌లను దేశాల వారీగా ఉంచడానికి ఆయన ఇంటి నేలమాళిగలో అరలతో కూడిన ఒక గదినే నిర్మించాడు. దాదాపు లైబ్రరీలా కనిపించే ఈ గది ఒక విధంగా పెప్సీ మ్యూజియం అని చెప్పేటట్లు ఉంటుంది. ఎందుకంటే, అక్కడ 1948 నాటి పెప్సీ మొట్టమొదటి ఎడిషన్‌తో పాటు 1985లో తయారు చేసిన 'స్పేస్ కెన్స్', సిల్వర్ బ్యాక్‌గ్రౌండ్ చిత్రంతో కూడిన ప్రత్యేక ఎడిషన్.. ఇంకా చాలానే కనిపిస్తాయి. మిలన్‌కు చెందిన క్రిస్టియన్ మార్చి 2004లోనే 4,391 పెప్సీ డబ్బాలతో రికార్డును బద్దలు కొట్టాడు. ఇక, ఇటీవల మార్చి 2022లో మళ్లీ లెక్కించి, మరో మారు ఈ తాజా రికార్డును నమోదు చేసుకున్నాడు.