New study: మీ బెడ్ రూమ్ సేఫ్‌గా ఉందా.. ఉతకని దిండు కవర్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!

by Anjali |   ( Updated:2024-10-16 11:06:16.0  )
New study: మీ బెడ్ రూమ్ సేఫ్‌గా ఉందా.. ఉతకని దిండు కవర్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: మనిషికి తప్పకుండా 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. కానీ ప్రస్తుత రోజుల్లో పిల్లలు అర్థరాత్రి పడుకోకుండా ఫోన్లలో లీనమైపోతున్నారు. స్మార్ట్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు జీవితాలను హైజాక్ చేస్తున్నాయడంలో సందేహం లేదు. పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా మొబైల్స్ నుంచి బయటపడటం చాలా కష్టంగా ఉంది. చాలా సమయం పాటు స్క్రీన్‌లపై గడపడం వల్ల బలహీనత, అలసట, నిద్రలేమితో బాధపడుతున్నారు. ఈ ఫోన్ల వల్ల జనాలు చాలా లేజీగా తయారు అవుతున్నారు. కాగా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా 8 గంటల నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు.

ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారం కూడా అవసరం. కాగా నిద్రపోయే ముందు గాడ్జెట్లకు దూరంగా ఉండటం అవసరమని నిపుణులు చెబుతూనే ఉంటారు. అంతేకాకుండా వాతావరణాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అంటున్నారు. నిద్రకు ఎలాంటి అవసరమో తాజాగా నివేదికను వెల్లడించారు నిపుణులు. ఉతకని దిండు కవర్‌లో ఒక వారంలో 3 మిలియన్ బ్యాక్టీరియాలు ఉంటాయట. టాయిలెట్ సీటు కంటే 17, 000 రెట్లు కలుషితమని వెల్లడైంది.

ఉతకని బెడ్‌షీట్‌లో బాత్రూమ్‌ డోర్ హ్యాండిల్స్ కంటే 24, 631 రెట్లు ఎక్కువ ఉంటాయని తాజా అధ్యయనంలో తేలింది. కాగా ఫలితాలు చూస్తే జనాలు భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఈ చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ వహించడం ముఖ్యమని నిపుణులు అంటున్నారు. దీంతో మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చని చెబుతున్నారు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed