- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిగిలిపోయిన అన్నంతో సూపర్ వంటకం.. ఒక్కసారి తిన్నారంటే?
దిశ, వెబ్‌డెస్క్: రాత్రిపూట మిగిలిపోయినా చలి అన్నం తినడానికి చాలా మంది ఇష్టపడరు. కాగా ఈ అన్నం వేస్ట్ చేయకుండా సాయంత్రం వేళ స్నాక్స్ లేదా మార్నింగ్ సమయంలోనేనైనా అల్పాహారంగా చేసుకుని రాత్రిపూట మిగిలిపోయినా చలి అన్నాన్ని తినడానికి చాలా మంది ఇష్టపడరు.కమ్మగా తినొచ్చు. మిగిలిపోయిన అన్నంతో ప్యాన్ కేక్స్ రెడీ చేయండి. ఒకసారి చేస్తే మళ్లీ మళ్లీ చేసుకుని తినాలనిపిస్తుంది. తరచూ అన్నంతో ఫ్రైడ్ రైస్ లాంటివి కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేసి చూడండి.
అన్నం ప్యాన్‌కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు..
పావు కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. రెండు కప్పుల అన్నం, ఆఫ్ కప్పు శనిగపిండి, 1 ఉల్లిపాయ ముక్కలు, క్యారట్ తురుము, బ్యాబేజ్ పావు కప్పు, సరిపడ పసుపు, ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు స్ఫూన్ల పెరుగు, కొత్తిమీర తరుగు, ఆయిల్ తీసుకోవాలి.
అన్నం ప్యాన్‌కేక్ తయారీ విధానం..
ముందుగా గిన్నె తీసుకుని అన్నం, ఉల్లిపాయ ముక్కలు, క్యారట్ తురుము, క్యాబేజ్ తురుము, ఉల్లికాడ తురుము వేసుకుని కలపాలి. తర్వాత శనిగపిండి, గోధుమపిండి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, పచ్చిమిర్చి, పెరుగు, కొత్తిమీర, ఉప్పు వేసుకుని కలిపి.. పావు కప్పు వాటర్ పోసి చపాతీ పిండికన్నా మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తడిగుడ్డలో పెట్టి 15 నిమిషాల పాటు ఉంచాక.. సమాన భాగాలుగా ఉండలు చేసుకోవాలి. తర్వాత ప్లాస్టిక్ కవర్ తీసుకుని దానిపై ఆయిల్ రాసి పిండి ఉండను వెడల్పుగా ఒత్తి.. పరాటా సైజులోకి తీసుకురావాలి. ఇక గ్యాస్ పై పెనం పెట్టి.. ఆయిల్ వేసి వేడయ్యాక ప్యాన్ కేక్ దానిపై వేయాలి. చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. రంగు మారేవరకు కాల్చితే ప్యాన్ కేక్ తయారైనట్లే.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.