టూరిజంపై కేంద్రం ఫోకస్..

by Manoj |
టూరిజంపై కేంద్రం ఫోకస్..
X

న్యూఢిల్లీ: పర్యాటక రంగ అభివృద్ధిపై కేంద్రం ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. హై ఎండ్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. అలాగే టూరిజంలో వ్యాపార కార్యక్రమాలు నిర్వహించి అగ్రగామి దేశంగా భారత్‌ను అభివృద్ది చేయాలని భావిస్తోంది. విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి హై ఎండ్ టూరిజం అభివృద్ధికి నిధులు కేటాయించాలని.. దీనికి సంబంధించిన నివేదికను ఆదివారం కేంద్రానికి సమర్పించింది.

'రీబిల్డింగ్ టూరిజం ఫర్ ది ఫ్యూచర్-2022' పేరుతో 'బ్లీజర్ ట్రావెల్' అనే కొత్త స్కీమ్‌ను నాంగియా అండర్సన్ ఎల్ఎల్‌పీ సంస్థ తీసుకొచ్చింది. వ్యాపారం-పర్యాటకం రెండూ అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగులు ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ ఉద్యోగం చేస్తున్నారు. ఒకే చోట ఉద్యోగం చేయడం వల్ల వారికి నచ్చడం లేదు. దీంతో చాలా మంది ఉద్యోగస్తులు ట్రావెల్స్ చేస్తూ వర్క్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా పబ్లిక్ సెక్టార్ అడ్వైజరీ హెడ్ సూరజ్ నంగియా మాట్లాడుతూ.. పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని టూరిజం అభివృద్ధికి సాంకేతికతను జోడిస్తున్నామన్నారు. మెరుగైన అనుభవం కోసం టూరిజం ప్రదేశాలకు వెళ్లడానికి రిజర్వేషన్ ప్రక్రియ, ప్రయాణ తేదీ తదితర వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా ఈ సేవలను విస్తృతం చేస్తామన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే.. దేశం అగ్రగామిగా నిలుస్తుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed