నాడీ శోధన ప్రాణాయామం ఎలా చేయాలి ఉపయోగాలేంటి?

by Manoj |   ( Updated:2023-10-10 16:16:28.0  )
నాడీ శోధన ప్రాణాయామం ఎలా చేయాలి ఉపయోగాలేంటి?
X

దిశ, ఫీచర్స్: మొదటగా వజ్రాసనంలో కూర్చుని వెన్నును నిటారుగా ఉంచాలి. ఇప్పుడు మధ్యవేలిని కనుబొమ్మల మధ్యన ఉంచాలి. ఉంగరం వేలితో ఎడమ వైపు ముక్కును, బొటనవేలితో కుడివైపు ముక్కును‌ మూసివేయాలి. తర్వాత కుడివైపు ముక్కుపై బొటన వేలిని అలాగే ఉంచి ఎడమ వైపు ముక్కు నుంచి గాలిని లోపలికి పీలుస్తూ కుడి ముక్కు నుంచి వదలాలి. మళ్లీ ఈసారి కుడివైపు నుంచి గాలిని లోపలికి పీల్చుతూ ఎడమవైపు ముక్కు నుంచి వదలాలి. ఇలా గాలిని లోపలికి, బయటికి పన్నెండుసార్లు పీల్చుతూ వదిలేయాలి. లెక్క మీద దృష్టి సారించకుండా క్రమపద్ధతిలో చేయాలి. లోపలి శ్వాస నిలుపుదలను 14 సెకన్లతో ప్రారంభించి క్రమంగా పెంచాలి. ఆ తర్వాత ఎడమ చేతి వేళ్లతో కుడి, ఎడమ రంధ్రాలు మార్చి చేయాలి.

ప్రయోజనాలు :

* హృదయ స్పందన రేటు పెంచుతుంది.

* జీవక్రియను ప్రేరేపిస్తుంది.

* నాడివ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది.

* ఉదాసీనత, నీరసం తగ్గిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed