Viswant Duddumpudi: అభిమానులకు షాకిచ్చిన గేమ్ ఛేంజర్ నటుడు.. ఆకట్టుకుంటోన్న పిక్స్

by Anjali |
Viswant Duddumpudi: అభిమానులకు షాకిచ్చిన గేమ్ ఛేంజర్ నటుడు.. ఆకట్టుకుంటోన్న పిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘కేరింత’ సినిమా ద్వారా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు హీరో విశ్వంత్. మొదటి చిత్రంతోనే ఈ నటుడు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కేరింత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది తర్వాత మనమంతా, ఓ పిట్ట కథ, జెర్సీ,బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, హైడ్ అండ్ సీక్, కథ వెనక కథ వంటి చిత్రాల్లో నటించి జనాల్ని మెప్పించాడు. విశ్వంత్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.. కానీ ఈ సినిమాలు ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో హిట్ కాలేకపోయాయి. ఇకపోతే ఈ హీరో త్వరలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రీసెంట్ గానే రామ్ చరణ్ తో కలిసి గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నానని ఓ ప్రెస్ మీట్ లో తెలిపాడు. ఇదంతా పక్కన పెడితే.. విశ్వంత్ భావన అనే అమ్మాయితో ‘ప్రామిస్ ఫర్ లైఫ్ టైం’ అనే క్యాప్షన్ రాసుకొచ్చిన పిక్స్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరీ ఈ పిక్స్ నిశ్చితార్థానికి సంబంధించినవా? లేక రిసెప్షనివా? అంటూ జనాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విశ్వంత్ అండ్ భావనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed