- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మన సెంటర్ గుజరాత్‌కు పాయే...
దిశ, తెలంగాణ బ్యూరో :భారతీయ సాంప్రదాయ వైద్యం, మందులు తయారీ, రీసెర్చ్ల కొరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలనుకున్న ' గ్లోబల్ సెంటర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్(జీసీటీఎం)' ను కేంద్రం గుజరాత్‌కు తరలించింది. జామ్‌నగర్‌లో ట్రెడిషనల్మెడిసిన్సెంటర్ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. దీంతో రాష్ట్ర సర్కార్షాక్లో ఉన్నది. ఈ కేంద్రాన్ని హైదరాబాద్‌కు కేటాయిస్తున్నామని, అందుకు అవసరమైన ల్యాండ్ ఇవ్వాలని గతంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఐడీపీఎల్ ఏరియాలో ఇవ్వాలని కోరారు. అయితే అది గ్రీన్జోన్లో ఉన్నందున ట్రెడిషనల్మెడిసిన్ సెంటర్‌కు అనువైన స్థలం వేరే చోట ఉచితంగా ఇస్తామని మంత్రి హరీష్‌రావు కూడా కేంద్ర మంత్రికి లేఖ రాశారు. కానీ కేంద్రం వెంటనే ఆ సెంటర్‌ను గుజరాత్‌కు తీసుకువెళ్లిపోయింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ అడియాశలయ్యాయి.
సిద్ధంత పరంగా, పార్టీ ల మధ్య రాజకీయ విభేదాలు ఉండాలి కానీ, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో ఇలా చేయడం అన్యాయమని ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ఆయన గుర్తుచేశారు.
పరిశోధనలకు అనువైన ఏరియా...
హైదరాబాద్‌లో ఇప్పటికే సీసీఎంబీ, సీఎస్ఐఆర్, డీఆర్డీవో, ఎన్ఐఎన్, ఐఐసీటీ, ఎఫ్డీటీఆర్సీ వంటి శాస్త్ర పరిశోధన సంస్థలు ఉన్నాయి. దీంతో జీసీటీఎం వచ్చి ఉంటే మెడికల్ రీసెర్చ్‌లో అభివృద్ధి పెరిగేది. ఇప్పటికే హైదరాబాద్ మెడికల్ హబ్‌గా ఉన్నది. ఈ కేంద్రం నెలకొల్పడం వలన రాబోయే రోజుల్లో మెడికల్ వ్యవస్థ మరింత బలోపేతమై ప్రజలకు సులువైన వైద్యం అందించేందుకు ఉపయోగపడేది. స్వయంగా కేంద్ర మంత్రికి కిషన్‌రెడ్డికి విన్నపించినా జీసీటీఎం రాలేదని ప్రభుత్వం అసంతృప్తిని వ్యక్తం చేసింది. కేబినెట్ నిర్ణయంతో కిషన్ రెడ్డికి కేంద్రంలో ఉన్న పరపతి ఏమిటో తేలిపోయిందంటూ టీఆర్ఎస్ నేతలు, నెటిజన్లు సోషల్ మీడియాల్లో కామెంట్లు చేయడం గమనార్హం.