అమ్మాయిలు.. వెస్ట్రన్ దుస్తులు వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా? ఉత్తమ ఎంపిక ఇదే?

by Anjali |
అమ్మాయిలు.. వెస్ట్రన్ దుస్తులు వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా? ఉత్తమ ఎంపిక ఇదే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ ఏజ్ వచ్చాక అమ్మాయిలంతా లోదుస్తులు ధరిస్తారు. ఇవి శరీర విసర్జనల వల్ల బయటి దుస్తులను మురికిగా లేదా పాడవకుండా ఉంచడంలో మేలు చేస్తాయి. అంతేకాకుండా శరీరాకృతిని పెంచుతాయి. చల్లని వాతావరణంలో ఉన్నప్పుడు శరీరం వెచ్చగా ఉండేలా చేస్తాయి. అయితే ఇటీవల చాలా మంది వన్ పీస్ పొట్టి డ్రెస్సెస్ ధరించడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వెస్ట్రన్ డ్రెస్సెస్ కు మంచి క్రేజ్ ఉంది. ఇవి వేసుకుంటే అమ్మాయిలు మంచి లుక్‌‌తో కనిపిస్తారు. పదిమందిలో అందంగా, క్యూట్‌గా మెరిసిపోతారు. కానీ కొంతమంది అమ్మాయిలు ఈ పాశ్యాత్య దుస్తులు వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే వీటి కోసం లోదుస్తుల్ని ప్రత్యేకంగా కొనాల్సి ఉంటుంది. కాగా ఎలాంటి లోదుస్తులు ధరించాలో ఇప్పుడు చూద్దాం..

లాంగ్ కామిసోల్ ఉత్తమ ఎంపిక...

అమ్మాయిలు వన్ పీస్ డ్రెస్ వేసుకోవాలంటే లాంగ్ కామిసోల్ ఉత్తమ ఎంపిక. వీటిని ఫ్యాబ్రిక్ తో తయారు చేస్తారు. లాంగ్ కామిసోల్ లోదుస్తుల్ని వాడితే శరీర ఆకృతి కూడా అందంగా కనిపిస్తుంది. కాస్త పొట్టిగా ఉండేవి లేదా మోకాలు పొడవుంటే స్కర్ట్స్ ధరించినప్పుడు లోపల లాంగ్ కామిసోల్ వేసుకుంటే సౌకర్యవంతంగా ఉంటుంది.

ట్యూబ్ క్రాప్ టాప్..

అయితే కొన్ని రకాల దుస్తులకు కామిసోల్ వేసుకోరు కాబట్టి మీ వార్డ్ రోబ్‌లో ట్యూబ్ క్రాప్ టాప్ తప్పక ఉండాల్సిందే. పలు రకాల షర్టులకు, టాప్స్, హాఫ్ షోల్డర్ కు, స్లీవ్ సన్నగా ఉండే రకాలు ఉంటాయి. మంచి కవరేజీ ఇచ్చేందుకు ఈ ట్యూబ్ క్రాప్ టాప్ తప్పక వాడండి. నెక్ డీప్ ఉన్నా లేకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు.

కామిసోల్స్..

వెస్ట్రన్ దుస్తులు వేసుకున్నప్పుడు కామిసోల్స్ బెస్ట్ ఎంపిక అని చెప్పుకోవచ్చు. వెస్ట్రన్ టాప్స్, కుర్తాలు చాలా వరకు అయితే నెట్ డిజైన్లు లేదా లేసులతో వస్తాయి.. కాగా బ్రా ధరిస్తే అస్సలు కంఫార్ట్ గా ఉండదు. కాగా కామిసోల్స్ వాడితే సౌకర్యవంతంగా ఉంటుంది. వీటిలో న్యూడ్ రంగు క్యామిసోల్స్.. అంటే చర్మం కలర్ ఉంటాయి. అవి వేసుకుంటే లోదుస్తులు కనిపించవు. బ్రా ఆకారం కూడా కనిపించకుండా ఉంటుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed