- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆల్పైన్ ఫుట్‌బాల్.. ఏటవాలు మైదానంలో అద్భుత పోరు!
దిశ, ఫీచర్స్ : చాలా పోటీ క్రీడలు సాధారణంగా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్‌లలో జరుగుతాయి. అయితే ఆల్పైన్ ఫుట్‌బాల్ విషయంలో మాత్రం పిచ్ నిటారుగా ఉండాలి. పేరుకు తగ్గట్లుగానే, ఆల్పైన్ ఫుట్‌బాల్ అనేది ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన కాంపిటేటివ్ స్పోర్ట్ కాగా, ఆటలో మరింత మజా వచ్చేందుకు నిటారుగా ఉన్న పర్వత సానువులపై ఆడుతుంటారు.
ఒకప్పుడు స్పోర్ట్స్ అంటే ఓ ఆటవిడుపు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రీడలనే కెరీర్‌గా ఎంచుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అలాగే ఈ గేమ్స్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోతోంది. 200కుపైగా దేశాల్లో కొన్ని వందల స్పోర్ట్స్, గేమ్స్ ఉండగా.. ఆయా క్రీడలను బట్టి వాటి ఫ్యాన్‌బేస్ ఉంటుంది. మనదేశంలో క్రికెట్‌కు ఉన్నంత అభిమానులు మరే స్పోర్ట్స్‌కు లేరు. కానీ ప్రపంచంలో నంబర్ వన్ పాపులారిటీ ఉన్న క్రీడ ఫుట్‌బాల్. అమెరికాలో దీన్నే సాకర్ అంటారు. ఈ మొత్తం భూమిపై ఉన్న దేశాల్లో సాకర్ ఆడని దేశమంటూ ఏదీ ఉండదంటే అతిశయోక్తి కాదేమో.
అయితే ఆస్ట్రియన్ ఔత్సాహిక ఫుట్‌బాల్ క్రీడాకారులు 2014 ఫుట్‌బాల్ ప్రపంచ కప్ సమయంలో కొత్తరకమైన 'ఆల్పైన్ ఫుట్‌బాల్' ఆలోచనతో ముందుకు వచ్చారు. బోరింగ్ గేమ్‌ను రసవత్తరంగా మార్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆల్పైన్ ఫుట్‌బాల్ సహ-ఆవిష్కర్త ఫ్రాంజ్ మెయిర్ చెప్పారు. అంతేకాదు ఆల్ప్స్‌లో ఫ్లాట్ గ్రౌండ్‌ను కనుగొనడం చాలా కష్టం, కాబట్టి ఇక్కడ ఫుట్‌బాల్ మాత్రమే కాదు ఇతర క్రీడలు ఆడాలన్నా కాస్త కష్టమే. అందువల్ల అటువంటి పర్వత ప్రాంతంలోని క్రీడాభిమానులు కొత్తరకమైన పోటీతో తమ భూభూగానికి వైవిధ్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నించగా, అనుకున్నట్లుగానే స్థానికులు ఆల్పైన్ ఫుట్‌బాల్ ఆడటాన్ని ఎంతగానో ఇష్టపడుతున్నారు.
ఆల్పైన్ ఫుట్‌బాల్ నియమాలు సాధారణ వెర్షన్‌కు సమానంగా ఉంటాయి, కానీ అసమాన మైదానంలో గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పోరాడేందుకు మాత్రం అధికశక్తిని కలిగి ఉండాల్సి ఉంటుంది.