రాజకీయం పులుముకుంటున్నా డ్రగ్స్ వ్యవహారం

by Mahesh |
రాజకీయం పులుముకుంటున్నా డ్రగ్స్ వ్యవహారం
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత రెండు రోజుల క్రితం జుబ్లీహీల్స్ లోని రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌, పుడ్డింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ పై పోలీసులు జరిపిన దాడుల్లో కొందరు సినీ ప్రముఖులు, వ్యపారస్తులు, రాజకీయనాయకుల వారసులు పట్టబడ్డ విషయం తెలిసిందే. కాగా ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. గత కొద్ది రోజుల నుంచి పోలీసులు సోషల్ మీడియా, వివిధ ప్రకటనల ద్వారా 'డ్రగ్స్ అండ్ డ్రీమ్స్ 'అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తునే ఉన్నారు. కానీ సీటీలోని పబ్‌ల యాజమాన్యలు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్వవహరిస్తునే ఉన్నారు.

గతంలో లో జరిగిన సినీ ప్రముఖుల డ్రగ్స్ వ్యవహారం పై రేవంత్ రెడ్డి విసిరిన ' వైట్ చాలెంజ్' ఏ విధంగా దుమారం రేపిందో మనకు తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం కేటీఆర్ రేవంత్ రెడ్డి బంధువుల పై వ్యాఖ్యలు చేశారు. దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ నేను నా బంధువులు వస్తాం కేటీఆర్ నీ బంధువులు వస్తారా శాంపిల్స్ కోసం అని సవాల్ విసిరారు.

జూబ్లీహిల్స్ పోలీసులకు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అభినందనలు

పుడ్డింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ వ్యవహారం పై మాజీ ఐపీఎస్ డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ పబ్‌లలో డ్రగ్స్ మత్తులో ఉన్న ప్రముఖులను పట్టుకున్నందుకు హైదరాబాద్ సిటీ పోలీసులకు ట్యాగ్ చేస్తూ.. ట్విట్టర్ వేదికగా అభినందనలు చెప్పారు. అలాగే బడా నేతలు, ప్రజల రక్తాన్ని పీల్చే జలగలు ఫాంహౌస్ లో రేవ్ పార్టీల మీద కూడా ఒక నజర్ వేయగలరని 'లెట్స్ మేక్ తెలంగాణ డ్రగ్స్ ఫ్రీ' అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Advertisement

Next Story