భారతదేశ తొలి మహిళా న్యాయమూర్తి ఎవరో తెలుసా?

by Manoj |
భారతదేశ తొలి మహిళా న్యాయమూర్తి ఎవరో తెలుసా?
X

దిశ, ఫీచర్స్: భారతదేశంలోనే తొలి మహిళా న్యాయమూర్తిగా కోనమనేని అమరేశ్వరి చరిత్రలో నిలిచిపోయింది. ఈమె గుంటూరు జిల్లా, అప్పికట్ల గ్రామంలోని ఓ వ్యవసాయ కుటుంబంలో 1928 జులై 10న జన్మించింది. 14వ ఏటనే పెళ్లి చేసినప్పటికీ భర్త ప్రోత్సాహంతో చదువు సాగించి ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు నుంచి 1948లో M.A పట్టభద్రురాలైంది. తర్వాత న్యాయశాస్త్రంలో కూడా పట్టా పొంది మద్రాసు ఉన్నత న్యాయస్థానంలో సీనియర్ న్యాయవాది దగ్గర ప్రాక్టీస్ చేసింది.

ఈ క్రమంలోనే 1960-1961లో బార్ కౌన్సిల్ సభ్యురాలిగా ఎదిగిన ఆమె.. 1978లో ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమింపబడి దేశంలోనే తొలి మహిళా న్యాయమూర్తిగా పేరు పొందింది. ఇక పదమూడున్నర ఏళ్లు న్యాయమూర్తిగా పనిచేసి 1990లో సీనియర్‌గా పదోన్నతి పొంది పదవీ విరమణ చేసిన అమరేశ్వరి.. భారత మహిళా న్యాయవాదుల సంఘానికి ఉపాధ్యక్షురాలిగా, ఆంధ్ర ఉన్నత న్యాయస్థానంలోని న్యాయవాదుల సంఘానికి ఉపాధ్యక్షురాలిగా సేవలందించి 2009 జులై 25న ఢిల్లీలో మరణించింది.

Advertisement

Next Story

Most Viewed