Acidity Remedies: ఎసిడిటీ కారణంగా కడుపులో తీవ్రమైన నొప్పి వస్తుందా? బెస్ట్ హోం రెమెడీస్ మీ కోసం!

by Anjali |   ( Updated:2024-10-16 16:02:34.0  )
Acidity Remedies: ఎసిడిటీ కారణంగా కడుపులో తీవ్రమైన నొప్పి వస్తుందా?  బెస్ట్ హోం రెమెడీస్ మీ కోసం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎసిడిటీ సమస్య ఉన్నవారికి గుండెలో, ఛాతీలో, గొంతులో, జీర్ణాశయంలో మంటగా వుంటుంది. అలాగే పుల్లటి తేపులతో ఆహారం నోటిలో వచ్చినట్లు అవుతుంది. కడుపు ఉబ్బినట్లు ఉండటమే కాకుండా అప్పుడప్పుడు వాంతులు కూడా వస్తాయి. పొట్టలో తీవ్రంగా నొప్పి వస్తుంది. పొట్టలో చికాకుగా ఉంటుంది. ఎసిడిటీతో గ్యాస్ వల్ల వచ్చే పెయిన్ ఒక్కోసారి బాగా ఇబ్బంది పెడుతుంది. కాగా ఈ సమస్య నుంచి బయటపడాలంటే పలు హోం రెమెడీస్ పాటించితే చాలంటున్నారు నిపుణులు. ఈ టిప్స పాటించితే ఎసిడిటీ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

పుదీనా ఆకులు..

ఎసిడిటీ సమస్యను దూరం చేయాలంటే పదీనా ఆకుల్ని మెత్తగా నమిలి మిగండి. ఆకులను క్లీన్ గా కడిగి నల్ల ఉప్పు యాడ్ చేసుకుని తింటే గ్యాస్ కారణంగా వచ్చే నొప్పి నుంచి ఉపశమం కలుగుతుంది.

బెస్ట్ మెడిసిన్‌లా పనిచేస్తోన్న ఆవాలు..

ఆవాలు కూరల్లో పోపుకు ఉపయోగిస్తారు. ఇవి ఎసిడిటీ ప్రాబ్లమ్ నుంచి బయటపడేస్తాయి. కాగా ఒక స్ఫూన్ తీసుకుని అందులో ఆవాలు కొద్దిగా వాటర్ పోసి వేడి చేయాలి. తర్వాత దాన్ని నాభిలో వేసి రుద్దండి. ఈ మిశ్రమాన్ని అప్లై చేసిన కొంత సమయానికి పెయిన్ తగ్గిపోతుంది. పిల్లలకు కడుపునొప్పి వస్తే ఈ చిట్కా ఫాలో అయితే రిలీఫ్ ఉంటుంది.

అల్లం వాటర్..

అల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని కూరల్లో కూడా వాడుతారు. తాజా అల్లంతో ఎసిడిటీ ప్రాబ్లమ్ ను తరిమికొట్టొచ్చు. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గ్లాస్ వాటర్ లో అల్లం తరుగు వేసి మరిగించి.. ఆ వాటర్ ను వడకట్టి తాగాలి. దీంతో కడుపులో నొప్పి తగ్గుతుంది.

ఒరేగానో విత్తనాలు..

ఎసిడిటీ ప్రాబ్లమ్‌లో బాధపడేవారికి థైమ్ సీడ్స్ బాగా మేలు చేస్తాయి. కాగా వెచ్చని వాటర్‌తో ఈ సీడ్స్ వేసి కొంచెం నల్ల ఉప్పు యాడ్ చేసుకుని తాగితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. ఒరేగానో విత్తనాల్ని పూర్తిగా నమలండి. లేదా సిప్ చేయడం లాంటివి చేయండి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story