- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాధితుల నుంచి తెల్లకాగితాలపై సంతకాలు.. సీఎంకు సీపీఐ రామకృష్ణ లేఖ
దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. జంగారెడ్డి గూడెం బాధితులకు న్యాయం చేయాలని.. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జంగారెడ్డి గూడెంలో సీపీఐ ప్రతినిధి బృందం గురువారం పర్యటించి, కల్తీ సారా మృతుల కుటుంబాలను పరామర్శించడం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. కల్తీ మద్యం తాగి 27 మంది చనిపోతే.. దాన్ని పక్కదారి పట్టించేందుకు అటు ప్రభుత్వం ఇటు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఇది చాలా దుర్మార్గమని రామకృష్ణ అన్నారు.
'స్వయంగా తమరే అసెంబ్లీ సాక్షిగా ఇవి కల్తీసారా మరణాలు కాదని ప్రకటించటం దుర్మార్గం. కల్తీసారా మరణాలకు కారణమైన బాధ్యులను కఠినంగా శిక్షించాలి' అని డిమాండ్ చేశారు. మరోవైపు తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టాల్సిందిగా మృతుల కుటుంబ సభ్యులను ఒత్తిడికి గురిచేసిన అధికారులపై చర్యలు చేపట్టాలి. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జంగారెడ్డి గూడెంలో పర్యటించి బాధిత కుటుంబాన్ని ఓదార్చాలి అని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.