చర్ల మండలంలో ఎదురుకాల్పులు..!

by Manoj |
చర్ల మండలంలో ఎదురుకాల్పులు..!
X

దిశ, చర్ల: చర్ల మండలంలో శుక్రవారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో మావోయిస్టులు తప్పించుకున్నట్లు చర్ల ఎస్‌ఐ అశోక్ స్థానిక పాత్రికేయులకు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. చర్ల సీఐ అశోక్ తన సిబ్బందితో కలిసి చర్ల మండలం పెద్దమిడిసిలేరు గ్రామ శివార్లలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో కిష్టారంపాడు, బత్తినపల్లి గ్రామాల మధ్యలో ట్రెంచింగ్ పనుల నిమిత్తం అక్కడ ఉన్న జెసిబి, బ్లేడ్ ట్రాక్టర్లను తగులబెట్టడానికి మావోయిస్ట్ యాక్షన్ టీం అక్కడికి వచ్చిందని సమాచారం వచ్చింది. వెంటనే తన సిబ్బందితో కలిసి ట్రెంచింగ్ పనులు జరిగే చోటుకు సీఐ అశోక్ బయలుదేరారు. అయితే ఘటనా స్థలానికి కొంచెం దూరంలో ఉండగా మావోయిస్ట్ పార్టీ LGS యాక్షన్ టీం కమాండర్ రాజేష్, మరో ఇద్దరు దళ సభ్యులు తమపై కాల్పులు జరుపుతూ.. బత్తినపల్లి వైపు పారిపోవడం జరిగిందని చర్ల సీఐ అశోక్ వెల్లడించారు. అనంతరం వారికి కోసం చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా.. బత్తినపల్లి అటవీ ప్రాంతంలో మళ్లీ తమపై కాల్పులు జరిపి వారు పారిపోయారని సీఐ పేర్కొన్నారు. కాగా స్థానిక అటవీశాఖ అధికారులు పనుల నిమిత్తం ఏర్పాటు చేసిన జెసిబి, ట్రాక్టర్లను తగులబెట్టడానికి డీజిల్ కోసం ఎదురు చూస్తున్న నిషేధిత మావోయిస్ట్ పార్టీ చర్ల ఏరియా యాక్షన్ టీం అకస్మాత్తుగా పోలీసుల రాకను గమనించి పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయారని సీఐ తెలిపారు. పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయిన చర్ల LGS యాక్షన్ టీమ్ కొరకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చర్ల సీఐ అశోక్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed