Chemicals in Cooking Utensils: ఈ వంట పాత్రల్లో వండుతున్నారా? ప్రాణాంతక వ్యాధులు రావడం పక్కా..?

by Anjali |   ( Updated:2024-10-17 14:56:08.0  )
Chemicals in Cooking Utensils: ఈ వంట పాత్రల్లో వండుతున్నారా?  ప్రాణాంతక వ్యాధులు రావడం పక్కా..?
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా చాలా మంది వంటలు అల్యుమినియం పాత్రల్లో చేస్తారు. మరికొంతమంది స్టీల్, కాపర్, మట్టి పాత్రల్లో కూడా వంట చేస్తుండటం చూస్తుంటాం. అయితే ఈ పాత్రలో పెద్దగా ప్రమాదం ఏం లేకపోయినా.. నాన్ స్టిక్ పాత్రలతో ముప్పు ఉందంటున్నారు నిపుణులు. బ్లాక్ ప్లాస్టిక్ పాత్రల్లో వంట చేస్తే హెల్త్ కరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయంటున్నారు పరిశోధకులు. రీసెంట్‌గా నిపుణులు 203 రకాల వంట పాత్రల్ని పరిశీలించగా.. అనేక పాత్రల్లో బ్రొమిన్ అనే డేంజరస్ రసాయనం ఉన్నట్లు తేలింది.

ఇందుకు సంబంధించిన విషయాలను కెమోస్పియర్ జర్నల్‌లో ప్రచురించారు. టేక్ అవే కంటేనర్లతో పాటు చిన్న పిల్లల బొమ్మల్లో కూడా నలుపు రంగు ప్లాస్టిక్స్ ఉన్నట్లు వెల్లడైంది. బ్లాక్ కలర్ ప్లాస్టిక్స్ లో బ్రోమినేటెడ్ ఫ్లేమ్ రిటార్డెంట్స్ అధిక మొత్తంలో ఉన్నట్లు వెల్లడించారు. దీంతో పిల్లల్లో కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని.. వీటి వల్ల ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ న్యూరో టాక్సిసిటీ, క్యాన్సర్, పునరుత్పత్తి వంటి సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు తెలిపారు.

వంట కోసం వాడే నాన్ స్టిక్ పాత్రల్లో విషరసాయనాలు ఉన్నాయని కాగా రోజుకు మనిషి బాడీలోకి 34, 700 పీపీఎం రసాయనాలు వెళ్తున్నట్లు అంచనా వేశారు పరిశోధకులు. కాగా ప్రజలు వంట పాత్రల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని.. ప్రాణాలకే ప్రమాదమని అంటున్నారు. వీలైనంత వరకు నలుపు రంగు ప్లాస్టిక్ వంట పాత్రల్ని వాడడం ఆరోగ్యానికి మేలని సూచిస్తున్నారు పరిశోధకులు. పిల్లలను కూడా ప్లాస్టిక్ బొమ్మలకు దూరంగా ఉంచాలని హెచ్చరిస్తున్నారు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed